తెలుగుదేశం పార్టీకి అసలు ఏమైంది. ఆ పార్టీ ఎందుకిలా మారిపోయింది. అన్నింటికీ ఒకే మంత్రం ఎందుకు జపిస్తోంది. ఎదురు దాడే అస్త్రంగా చేసుకుని ఏమి లాభం పొందుతోంది. ఆ పార్టీ మూల సిధ్ధాంతాలు ఏమయ్యాయి. ఎవరి శిక్షణ ఇది. ఇది రాజకీయాలకు మంచిదేనా. ఇదే తీరు కొనసాగించడం దీర్ఘకాలంలో మంచిదేనా.


ఎదురుదాడే ఆయుధం :


చంద్రబాబు హయాంలో టీడీపీకి ఇదే అసలైన సిలబస్, ఏం జరగనీ, ఎదురుదాడి చేసి పారేయ్. అవతలి వారి వాదన వినకుండా అది జనంలోకి పోకుండా వండి వార్చిన వాదనతో జనంలోకి వెళ్ళిపోవాలి. అదే జనం అనుకునేలా చేయాలి. ఇపుడు టీడీపీ అనుసరిస్తున్నది ఇదే. కొన్ని సందర్భాల్లో ఇలాంటి వ్యూహం సక్సెస్ అయినా చాలాసార్లు దెబ్బ తింటున్నారు తమ్ముళ్ళు. అయినా వారు ఇదే మార్గంలో పోతున్నారు. దాని వల్ల ముందు ముందు ఇబ్బందులు తప్పవని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.


జగన్ అటాక్ పైనా అదే:


వైఎస్ జగన్ అటాక్ విషయంలో టీడీపీ ఇదే ఆయుధాన్ని బయటకు తీసింది. జగన్ కావాలని దాడి చేయించుకున్నాడంటూ ముందుగా వండి వార్చిన కధనంతో జనంలోకి వచ్చేసింది. చంద్రబాబు మొదలుకుని మంత్రులు వరకూ ఒకటే వాయిస్ వినిపించారు. కానీ వారంతా ఒక విషయం మరచిపోతున్నారు. జగన్ రాజకీయ నాయకుడి కంటే కూడా ముందు మనిషి, ఏపీలో పౌరుడు. మరి కనీస మానవత్వంతో స్పందన ప్రభుత్వం వైపు నుంచి ఉందా


బూమరాంగ్ :


జగన్ వీరాభిమాని ఈ అటాక్ చేశాడంటూ టీడీపీ అనుకూల మీడియా ఊదరగొడుతోంది. ఎంత అభిమాని అయినా చంపించుకుంటారా. అదీ అత్యంత ప్రమాకరమైన కోడి పందేల కత్తితో అటాక్ చేయించుకుంటారా. ఒకవేళ అది మిస్ ఫెయిర్ అయితే. మెడకు తగిలితే ఏమయ్యేది. . ఇలాంటి  రిస్క్ మెదడు ఉన్నవాడు ఎవడైనా చేస్తాడా. జగన్ తానే కోరి చేయించుకోవాలంటే పాదయాత్రలో లక్షల జనం మధ్యన చేయించుకుంటే సానుభూతి వచ్చేది కదా. ఈ లాజిక్ మిస్ అయి టీడీపీ వేస్తున్న రంకెలు బూమరాంగ్ అవుతున్నాయి.


జనంలో సానుభూతి:


టీడీపీ ఎంత వద్దనుకున్నా ఇక్కడ జగన్ కి సానుభూతి జనంలో పెరిగింది. అది జగన్ అని  కాదు ఎవరికి జరిగినా వస్తుంది. ఇది భారతీయ సెంటిమెంట్. దానికి విరుధ్ధంగా రాజకీయమే పరమావధి అని పార్టీలకు ఉండొచ్చు కాక. జనానికి మాత్రం అలా లేదు. అందువల్లనే ఈసారి ఎదురుదాడి ఆయుధం తుప్పుపట్టింది. హుందా రాజకీయాలు చేస్తానని చెప్పుకునే ముఖ్యమంత్రి జగన్ పై దాడి నాటకం అని చెప్పడం ద్వారా ఆ హుందాతనాన్ని కోల్పోయారు. అదే టైంలో ఆయన కనీసం ఫోన్లోనైనా జగన్ ని పరామర్శించకుండా వ్యక్తిగతంగానే వ్యవహరించారా అనిపించుకున్నారు.


 ఇక్కడ మరోకటి చెప్పుకోవాలి. తెలంగాణా సీఎం కేసీయార్ జగన్ ని ఫోన్లో పరామర్శించారు. అంతేనా మహా కూటమి పేరిట ఏ కాంగ్రెస్ తో బాబు పొత్తులు పెట్టుకున్నా ఆ నాయకులూ జగన్ ని పరామర్శించారు. ఇక్కడ తెలిసిపోవడం లేదా రాజకీయం ఎవరు చేస్తున్నారో. మొత్తానికి టీడీపీ తన ఎదురుదాడి తో సెల్ఫ్ గోల్ వేసుకుందంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: