వైఎస్ జగన్ హత్యాయత్నం కేసులో సీబీఐ రంగంలోకి దిగుతుందా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ కేసు విషయంలో వాంగ్మూలం ఇచ్చేందుకు ఏపీ పోలీసకు జగన్ నిరాకరించిన సంగతి తెలిసిందే. తనకు ఏపీ పోలీసులపై నమ్మకం లేదన్న జగన్ డిల్లీ వైపు చూస్తున్నట్లుగా టాక్.


హైకోర్టులో పిటిషన్ :


కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థల కోసమే జగన్ తరఫున వైవీ సుబ్బారెడ్డి ఈ రోజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. స్వతంత్ర సంస్థ చేత హత్యాయత్నం ఘటనపై దర్యాప్తు జరిపించాలని ఆ పిటిషన్లో కోరారు. మరి దానిపై కోర్టు  కనుక ఆదేశిస్తే సీబీఐ రంగంలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.


ఏం జరుగుతుంది :


ఉప్పూ నిప్పులా ఉన్న టీడీపీ వైసీపీ  రాజకీయాల్లో సీబీఇ కనుక రంగంలోకి దిగితే చంద్రబాబు సర్కార్ ఏం చేస్తుందన్నది చూడాలి. ఇప్పటికే ప్రతీ దానికి కేంద్రం కుట్ర అంటూ అందరినీ కలిపి విమర్శిస్తున్న బాబు రేపటి రోజున నిజంగా సీబీఐ రంగంలోకి దిగితే ఎలా రియాక్ట్ అవుతారన్నది చూడాలి. అదే సమయంలో ఈ హత్యాయత్నం వెనక ఉన్న రాజకీయ కోణాన్ని కనుక సీబీఐ వెలికి తీస్తే ఏపీ పాలిటిక్స్ హీట్ ఎక్కే అవకాశాలు ఉంటాయి. జగన్, బాబుల మధ్యన సమరం అపుడు కొత్త మలుపు తీసుకునే వీలుందంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: