విశాఖపట్నం విమానాశ్రయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద జరిగిన హత్యాయత్నం ఘటనపై స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ (సిట్)ను వైసిపి తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. సిట్ విచారణను వైసిపి ఎందుకంత తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఎందుకంటే వైసిపి నేతలు అందుకు కొన్ని కారణాలు చెబుతున్నారు. గతంలో వివిధ సందర్భాల్లో ప్రభుత్వం నియమించిన సిట్ విచారణ తాలూకు నివేదికలను ప్రభుత్వం ఇంత వరకూ బయట పెట్టలేదు. నివేదికలు బయట పెట్టకపోగా బాధ్యుల్లో ఏ ఒక్కరిపైనా ఇంత వరకూ చర్యలు తీసుకోలేదు.

 

ఘటన ఏదైనా కానీ మొదటి నుండి చంద్రబాబునాయుడు, తెలుగుదేశం పార్టీ తీరు అదే విధంగా కొనసాగుతోంది. కొన్ని ఘటనలను పరిశీలిద్దాం. 2015లో రాజధాని ప్రాంతాల్లో రైతుల పొలాలు తగలపడ్డాయి. వెంటనే అది వైసిపి పనే అని చంద్రబాబు చెప్పేశారు. రాజధాని నిర్మాణం ఇష్టంలేక వైసిపి వాళ్ళే చేశారంటూ మంత్రులు కూడా ఆరోపణలు చేశారు. ఘటన జరిగి నాలుగేళ్ళయినా ఇంత వరకూ వాస్తవాలేంటో ప్రభుత్వం బయటపెట్టలేదు. పొలాలు తగలపెట్టింది వైసిపి వాళ్ళే అయితే ఎందుకు అరెస్టు చేయలేదు ?


అదే విధంగా తూర్పుగోదావరి జిల్లా తునిలో 2016, ఫిబ్రవరిలో రత్నాచల్ రైలు తగలబడింది. వెంటనే చంద్రబాబు స్పందించి ఘటన రాయలసీమ,  పులివెందుల గూండాల పనే అంటూ ప్రకటించేశారు. తర్వాత ఘటనపై విచారణ జరిపించారు. ఇన్సిడెంట్ జరిగి రెండున్నరేళ్ళవుతున్నా వాస్తవాలేంటో బయటకు రాలేదు. చంద్రబాబు చెప్పిందేమో రాయలసీమ, పులివెందుల రౌడీలన్నారు. అరెస్టులు చేసింది మాత్రం గోదావరి జిల్లాల్లోని కాపులని.

  

2015, నవంబర్ లో చిత్తూరు మేయర్ దంపతుల హత్య జరిగింది గుర్తుందా ? హత్య జరగ్గానే బలిజలపై రెడ్ల దాడిగా టిడిపి ఎంఎల్ఏ బోండా ఉమా మహేశ్వరరావు ఆరోపణలు చేశారు. అంటే బలిజలకు రెడ్లకు మధ్య గొడవలు పెట్టాలన్నది టిడిపి ఉద్దేశ్యం. కానీ చివరకు ఏమి తేలింది ? ఆస్తుల కోసం మేనల్లుడే హత్య చేయించినట్లు జిల్లా ఎస్పీ చెప్పారు. దాంతో టిడిపి మళ్ళీ నోరిప్పలేదు.


అమరావతి అసెంబ్లీలోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాంబర్ వర్షాలకు లీకౌతోంది. చాంబర్ పైనున్న పైపులను వైసిపి వాళ్ళే కోసేశారంటూ చంద్రబాబు, స్పీకర్ కోడెల శివప్రసాద్ తదితరులు ఆరోపించారు. తర్వాత విచారణ జరిపించారు. అయితే, విచారణలో ఏమి తేలిందో మాత్రం బయటపెట్టలేదు. ఇలా ప్రతీ ఘటనలోను ముందు వైసిపి మీదే గుడ్డకాల్చి మీదేసి వరసుపెట్టి ఆరోపణలు చేసి టిడిపి జగన్ ను బద్నాం చేస్తోంది.  విచారణ జరిపిస్తోంది కానీ నిజాలు బయటకు రాకుండా చేస్తోంది. అందుకనే వైసిపి ప్రభుత్వం చెబుతున్న సిట్ విచారణను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: