టీడీపీ గరుడ పురాణం అంటూ ఒక కొత్త నాటకానికి తేర లేపింది. అయితే ఇప్పడూ పరిస్థితులు చూస్తుంటే గరుడ పురాణం టీడీపీ స్క్రిప్ట్ లాగా అనిపిస్తుంది. అయితే  గత కొన్నాళ్ల నుంచి బాబు ఢిల్లీ టూర్లు తగ్గిపోయాయి. ఎన్డీయేతో కలిసి ఉన్నన్ని రోజులూ.. నెలకు ఒకసారి అయినా తిరుపతి ప్రసాదాలు పట్టుకుని ఏదో ఒక పేరుతో ఢిల్లీ వెళ్లావాడు. కేంద్ర మంత్రులతో సమావేశాలు జరిపి..అది సాధించాం, ఇది సాధించాం అని చెప్పేవాడు. బీజేపీ నేతలతో కలిసి నవ్వులు చిందిస్తూ ఫొటోలకు పోజులు ఇచ్చేవారు. అయితే ఎన్డీయే నుంచి బయటకు వచ్చాకా ఈయన ఢిల్లీ టూర్లు బాగా తగ్గిపోయాయి.

 గరుడ పురాణం.. బాబు ఢిల్లీ టూర్ అట!

అయితే చంద్రబాబుకు ఇప్పుడు రాజకీయంగా మిగిలిన ఏకైక ఆయుధం ‘గరుడ పురాణం’. ఆటలో అరటిపండులా ఈ కథనే సాగదీస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఈ గరుడ పురాణం కేంద్ర ప్రభుత్వం కుట్ర అని అంటున్నారు. అయితే కుట్ర అంతా వీళ్లకు తెలిసి నెలలు గడిచిపోయాయి. అయితే అది మాత్రం అలాగే కొనసాగుందట! మరి తాము పన్నిన కుట్ర లీక్ అయిపోయినా.. దాన్నే ఫాలో అయ్యేంత అమాయకంగా ఉంటారా కేంద్ర ప్రభుత్వం వాళ్లు? అరే.. ఈ కుట్ర లీక్ అయిపోయింది.. మరో మార్గం వెదుక్కొందాం అనుకోరా? కోరుగాక కోరంతే! ఇదంతా చూస్తుంటే.. ఎవరైతే ఇదంతా కుట్ర అని అంటున్నారో.. వారే దీన్ని అమలు చేస్తున్నారని ఇక్కడ స్పష్టం అవుతోంది.

Image result for chandra babu

ఒకవేళ ఈ గరుడపురాణం కుట్ర కేంద్రానిదే అయితే అది లీక్ కాగానే రూటు మార్చాలి. అలా జరగలేదు. వీళ్లు చెప్పిందే జరుగుతోందని అంటున్నారు. అంటే అమలు చేస్తున్నది వీళ్లే కదా! ఈ చిన్న లాజిక్ కూడా ప్రజలకు అర్ధం కాదనుకుంటున్నారా... ఇక రేపు వెళ్లి చంద్రబాబు ఏం చెబుతాడో ప్రత్యేకంగా విననక్కర్లేదు. గత రెండు మూడు నెలలుగా ఏం జరిగినా చంద్రబాబు ఒకేలా మాట్లాడుతున్నాడు. ‘మేం ప్రత్యేక హోదా అడిగినందుకు ఇదంతా చేస్తున్నారు..’ అని అంటాడు. ఈయన ‘ప్రత్యేకహోదా’ గురించి మాట్లాడటం.. ఏపీ ప్రజలు వినడం.. అంతకు మించిన నిస్సిగ్గు రాజకీయం ఏకేదైనా ఉంటుందా?

మరింత సమాచారం తెలుసుకోండి: