జగన్ మీద దాడి జరగడం తో వైసీపీ నేతలు అధికార పక్షమైన టీడీపీ మీద ఎదురు దాడికి దిగింది. దీనితో టీడీపీ కూడా వెంటనే వైసీపీ మీద ఎదురు దాడి మొదలు పెట్టింది మరియు ఇది కేంద్రం కుట్రేనని దుమ్మెత్తి పోస్తుంది. అయితే మోడీ గవర్నర్ ద్వారా జగన్ ఆరోగ్యం గురించి రాష్ట్ర పరిస్థితులు గురించి అడిగి తెలుసుకున్నాడంటా. జగన్ మీద దాడిని కేంద్రం మీద నెడుతున్న టీడీపీ మీదకు ఎదురు దాడికి దిగాలని బీజేపీ మోడీ దిశా నిర్దేశం చేశాడంటా...!

Image result for narendra modi and jagan

అయితే వైసీపీ నాయకులూ ఆవేశ పడకుండా సంయమనం పాటించారు.  తొలిరోజు రాజ్యాంగబద్దంగా నిరసన చేపట్టిన నేతలు, మలిరోజు ప్రార్థనలతో ముగించారు. జగన్ త్వరగా కోలుకోవాలని రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆలయాల్లో పూజలు నిర్వహించారు. దాడి జరిగిన తర్వాత జగన్ ట్విట్టర్ లో స్పందించిన తీరు కూడా ఇందుకు కారణం కావచ్చు. ఇదే దాడి వేరేవారిపై జరిగి ఉంటే పరిస్థితి ఊహించుకోడానికి కూడా కష్టం.

Image result for narendra modi and jagan

జగన్ పై హత్యాయత్నంతో రాజకీయంగా లబ్దిపొందాలని చూసిన టీడీపీకి ఇది ఊహించని షాక్. ఇంత దారుణమైన ఘటన జరిగినప్పటికీ జగన్ సూచనల మేరకు వైసీపీ శ్రేణులు సంయమనం కోల్పోకపోవడం వారి పరిపక్వతకు నిదర్శనం. వైసీపీ ఎమ్మెల్యేల నుంచి కార్యకర్తల వరకు అంతా ఆచితూచి వ్యవహరించారు. ఎవ్వరూ ఎక్కడా రెచ్చిపోలేదు. 2014కి 2019 ఎన్నికల నాటికి వైసీపీ నేతలు, శ్రేణుల్లో ఎంత పరిణతి వచ్చిందో చెప్పడానికి ఈ ఘటనే పెద్ద ఉదాహరణ. 

మరింత సమాచారం తెలుసుకోండి: