ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐటీ దాడులు మరియు అదే విధంగా ప్రతిపక్ష నేత జగన్ పై జరిగిన దాడి ఉద్దేశించి..మరియు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు బట్టి ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో కొంతమంది ప్రధాన జాతీయ నాయకులతో బిజీబిజీగా గడిపారు. ఈ సందర్భంగా ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించారు చంద్రబాబు.

Image result for chandrababu

చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం అధికారంలో ఉన్న మోడీ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 2014 ఎన్నికల ముందు ప్రధానిగా ఉన్న మన్మోహన్ సింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని పార్లమెంట్ సాక్షిగా ప్రకటించారని..తర్వాత అధికారంలోకి వచ్చిన మోడీ సర్కార్ ఆ హామీలను తుంగలోకి తగ్గాలని..ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ ఒక్క విభజన హామీలు నెరవేర్చలేదని చంద్రబాబు పేర్కొన్నారు.

Image result for chandrababu

మోడీ ప్రభుత్వం తో కలిసి ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీని దెబ్బతీసే ప్రయత్నాలు బీజేపీ పెద్దలు చేశారని సంచలన కామెంట్లు చేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీ వైసీపీకి మరియు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కి చీకటి ఒప్పందాలు ఉన్నాయని ఆరోపించారు. అంతేకాకుండా మోడీ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు చంద్రబాబు..‘నువ్వు 2002లో గుజరాత్ ముఖ్యమంత్రి అయితే.. నేను 1995లోనే సీఎం అయ్యా.

Image result for modi

నాకు పరిపక్వత లేదంటావా? దాని అర్థం ఏమిటంటూ నిల‌దీశారు. దేశంలో రెండో తరం ఆర్థిక సంస్కరణలను నేను అమ‌లు చేశాన‌ని అందుకే..హైదరాబాదులో ప్రపంచ పటంలో ప్రత్యేకమైన స్థానాన్ని కల్పించానని పేర్కొన్నారు. కేంద్రం రాష్ట్రంపై ఎన్ని కుట్రలు పన్నినా రాష్ట్ర ప్రజలందరికీ రాష్ట్రంలో జరుగుతున్నది ప్రతి ఒకటి గమనిస్తున్నారని..ఢిల్లీలో మోడీ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు చంద్రబాబు.




మరింత సమాచారం తెలుసుకోండి: