దక్షిణాదిలో పాగావేయాలని ఎత్తులకి పై ఎత్తులు వేస్తూ ఎంతో వ్యూహాత్మకంగా వెళ్తున్న బీజేపీ ప్రభుత్వం మెల్ల మెల్లగా పట్టు బిగిస్తోందా..?? తమిళ నాడులో తనదైన ముద్ర వేస్తూ జయలలిత మరణం తరువాత పూర్తి స్థాయిలో తమిళ రాజకీయాల్లో పాదం మోపిన బీజేపీ ఇప్పుడు అక్కడి ప్రభుత్వాన్ని తన గుప్పెట్లో పెట్టుకుని నడిపిస్తోందని వేరేగా చెప్పనవసరం లేదు. తమిళ రాజకీయాల్లో బీజేపీ ఆడింది ఆట పాడింది పాటగా ఉంది ప్రస్తుత పరిస్థితి. తమిళ నాడు తరువాత బీజేపీ కమ్యునిస్టుల కంచుకోటలో పాగా వేయాలని అనుకుంది. అందుకు తగ్గట్టుగానే.

 Image result for amit shah sabarimala

శబరిమల ఆలయ వ్యవహారంపై వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. మహిళలని అనుమతించాలని కోర్టు కేరళ ప్రభుత్వానికీ ఆదేశాలు ఇవ్వడంతో ఆదిశగాప్రభుత్వం చర్యలు చేపట్టడం దాంతో అయ్యప్ప భక్తులు మహిళలని వెళ్ళనివ్వకుండా చేయడం ఈ క్రమంలోనే ప్రభుత్వం ఆరెస్సెస్ వారిని అయ్యప్ప భక్తుల అరెస్టులు చేయడం జరిగింది..దాదాపు రెండు వేలమందిని అరెస్ట్ చేయడంతో ఒక్కసారిగా కేరళా ప్రభుత్వం పై నిరసనలు పెల్లుబికాయి. కావాలనే ప్రభుత్వం హిందూదేవాలయాలని టార్గెట్ చేస్తోందని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు.

 Image result for amit shah sabarimala vs kerala cm

అయితే ఈ క్రమంలోనే షా ఎంట్రీ తో ఒక్క సారిగా సీఎం షాక్ తిన్నారు..అయ్యప్ప భక్తులకి బీజేపీ అండగా ఉంటుందని ప్రకటన చేయడంతో కేరళ సీఎం కి వ్యుజులు దాదాపు మాడిపోయాయి.. శనివారం కన్నూర్ బీజేపీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించిన షా..అక్కడ ఏర్పాటు చేసిన సభలో స్వామియే శరణం అయ్యప్ప అంటూ ప్రసంగం మొదలు పెట్టారు..అప్పటికి కాని అర్థం కాలేదు షా వ్యూహం కేరళా సీఎం కి. అంతేకాదు షా మాట్లాడుతూ కేరళా ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు.కేరళలో మత సంప్రదాయాలకు, రాష్ట్ర ప్రభుత్వ క్రూరత్వానికి మధ్య పోరాటం జరుగుతున్నదని ప్రభుత్వంపై విమర్శలు చేశారు.

 Image result for sabarimala issue

సుప్రీంకోర్టు తీర్పు పేరిట కేరళ ప్రభుత్వం చేస్తున్న క్రూరత్వాన్ని ఆపాలని , మతం పేరిట హింసను రెచ్చగొట్టే ప్రయత్నం చేయద్దని సీఎంను హెచ్చరిస్తున్నాను అని అన్నారు. దేశంలోని పలు ఆలయాలలో మహిళలకు ప్రవేశం లేదని, మరికొన్నింటిలోకి పురుషులను రానీయరన్నారు. రాష్ట్ర ప్రభుత్వం భక్తుల మనోభావాలను దెబ్బతీయకూడదని అన్నారు..దాంతో ఒక్కసారిగా బీజేపీ అజెండా బయట పడింది. ఆరెస్సెస్, సంఘ్‌పరివార్ ఎజెండాను బహిర్గతం చేశాయి. దాంతో సీఎం దిద్దుబాటు చర్యలని చేపట్టే పనిలో ఉన్నారని పలు కధనాలు వస్తున్నాయి.

 

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: