ఆపరేషన్ గరుడ పేరుతో ఆ మధ్య నానా హడావుడి చేసిన అవుట్ డేటెడ్ సినీనటుడు, వివాదాలకు కేంద్రబిందువైన శివాజి చౌదరి అరెస్టు తప్పేట్లు లేదు. జగన్ పై హత్యాయత్నం జరుగుతుందన్న విషయం శివాజికి ఎలా తెలుసో చెప్పాలంటూ రాష్ట్రంలోని అన్నీ వర్గాలు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. పైగా రాష్ట్రప్రభుత్వంపై కేంద్రప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆ కుట్ర అమలు ఆపరేషన్ గరుడలో భాగమని శివాజి ఎప్పుడో చెప్పాడని చంద్రబాబు కూడా నిర్ధారిస్తున్నారు. అంటే శివాజి చెబుతున్న ఆపరేషన్ గరుడను చంద్రబాబు అంగీకరించినట్లైంది.

 

ఇక్కడే శివజి తగులుకున్నారు. కేంద్రం కుట్ర విషయాన్ని శివాజి ఎప్పుడో బయటపట్టారంటే కుట్రకు సంబంధించి ఆయన దగ్గర పక్కా సమాచారం ఉందన్న విషయాన్ని ప్రతిపక్షాలు, జనాలు మండిపడుతున్నాయి. ఆ కుట్రేదో బయటపడాలంటే వెంటనే శివాజిని అరెస్టు చేయాల్సిందేనంటూ వైసిపి కూడా పట్టుబడుతోంది. అంతేకాకుండా శివాజి అరెస్టుకు ఈరోజు విజయవాడ సిటీ కమీషనర్ కు ఫిర్యాదు కూడా చేసింది. అదే సమయంలో ఢిల్లీలొ కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిసి హత్యాయత్నంపై ఫిర్యాదు చేసిన  వైసిపి ఎంపి విజయసాయిరెడ్డి తదితరులు కూడా శివాజి అరెస్టుకు డిమాండ్  చేస్తున్నారు.

 

అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నంలో శివాజి పాత్ర కూడా ఉందంటూ వైసిపి నేతలు ఆరోపిస్తున్నారు. ప్రధానప్రతిపక్ష నేతపై ప్రాణాపాయం లేని రీతిలో దాడి జరుగుతుందని గతంలో శివాజి చెప్పిన విషయాన్ని వైసిపి నేతలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్, గౌతమ్ రెడ్డి తదితరులు ప్రస్తావిస్తున్నారు. కాబట్టి హత్యాయత్నం ఘటనకు సంబంధించి వెంటనే శివాజిని అరెస్టు చేస్తే పూర్తి వివరాలు బయటకు వస్తాయని కూడా చెబుతున్నారు. మరి శివాజిని పోలీసులు అరెస్టు చేస్తారా ? అసలింతకూ హత్యాయత్నం జరిగి నాలుగు రోజులవుతున్నా శివాజి గొంతెక్కడా వినిపించటం లేదే ? శివాజి ప్రస్తుతం అమెరికాలో ఉన్నాడని అంటున్నారు. మరి తిరిగి రాగానే అరెస్టు ఉంటుందా ?


మరింత సమాచారం తెలుసుకోండి: