ఎక్కడ స్పందించాలో అక్కడే జగన్ స్పందించారు. తనపైన దారుణమైన హత్యాయత్నం జరిగిందని జగన్ ఆరోపించారు.  ఏకంగా పెద్ద కుట్రే జరిగిందని కూడా చెప్పారు.  కేంద్ర హోం మంత్రి రాజ్ నాధ్ సింగ్ కి రాసిన లేఖలో అయన తన మనోగతాన్ని వెల్లడించారు. తనను భౌతికంగా తొలగించాలన్న కుట్ర జరిగిందని కూడా జగన్ పెర్కొనడం విశేషం. 


బాబుకు షాక్:


ఇంతవరకూ జగన్ స్పందించలేదంటూ గొంతు చించుకున్న టీడీపీ తమ్ముళ్ళ నోళ్ళు జగన్ సుదీర్ఘమైన లేఖతో షాక్ తినే పరిస్థితి ఏర్పడింది. చంద్రబాబు అండ్ కో ఇప్పటికీ చేస్తున్న పేలవమైన వ్యాఖ్యలు, జరిగిన అతి పెద్ద హత్యాయత్నాన్ని తప్పుతోవ పట్టించే వైనాన్ని జగన్ లేఖలో కళ్ళకు కట్టారు. ప్రభుత్వం ముందుగానే నిర్ణయించున్న అజెండా మేరకు విచారణను తప్పుతోవ పట్టించిందని కూడా ఆరోపించారు. ఆపరేషన్ గరుడ పేరుతో కేసును తప్పు తోవ పట్టించాలని చూస్తున్నారని కూడా జగన్ ఆరోపించారు.


ఇది కుట్రే:


తనపైన జరిగిన హత్యాయత్నం కుట్ర అని జగన్ ఆరోపించారు. అందువల్లనే హత్య జరిగిన తరువాతన్ నుంచి ఓ పద్ధతి ప్రకారం ప్రభుత్వ పెద్దలు, పోలీసు అధికారులు కూడా వ్యవహిరిస్తూ వస్తున్నారని జగన్ అన్నారు. తనపైన అతి దారుణంగా హత్యప్రయత్నం జరిగితే ముఖ్యమంత్రి స్పందించిన స్థాయిలో స్పందన‌ లేకపొగా రాజకీయ కోణాన్ని  బయటకు తీశారని జగన్ ఆ లేఖలో మండిపడ్డారు. హత్య తానే చేయించుకున్నట్లుగా విషపు ప్రచారానికి తెర తీశారని కూడా జగన్ చెప్పారు.


న్యాయం కావాలి:


తనపైన హత్యాయత్నం జరిగిన తరువాత పరిణామాలను చూసిన తాను ఏపీ పోలీసుల దర్యాప్తులో న్యాయం జరగదని భావించినట్లుగా జగన్ చెప్పుకొచ్చారు. ముందే నిర్ధారణ చేసుకున్న ఆ విచారణ వల్ల ఎటువంటి ప్రయోజనం లేదని కూడా జగన్ అన్నారు. ఓ బాధితునిగా తనకు న్యాయం జరగాలని కోరుకునే హక్కు వుందని జగన్ పెర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తన అవసరాలకు అనుగుణంగా దర్యాప్తు సంస్థను ప్రేరేపిస్తున్న నేపథ్యంలో కేంద్రం తక్షణం జోక్యం చేసుకోవాలని కోరుతున్నానని జగన్ లేఖలో పెర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: