విశాఖపట్నం విమానాశ్రయంలో జగన్మోహన్ రెడ్డిపై జరిగిన హత్యకు కోటి రూపాయల సుపారి కుదుర్చుకున్నారా ?  వైసిపి వర్గాల చెబుతున్న ప్రకారం అవుననే సమాధానం వినిపిస్తోంది. రోజులు గడిచే కొద్దీ జగన్ పై హత్యాయత్నం వెనుక భారీ కుట్ర ఉన్నట్లు అందరిలోను అనుమానాలు పెరిగోతోంది. కారణాలేమిటంటే డిజిపి, మంత్రులు, చంద్రబాబు చేస్తున్న ఆరోపణలే.

 

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, జగన్ పై హత్యాయత్నానికి పాల్పడ్డ నిందితుడు శ్రీనివాస్ విమానాశ్రయంలో ఓ క్యాంటిన్లో పనిచేస్తున్నారు. క్యాంటిన్ యజమాని హర్షవర్ధన్ చౌదరిపైన కూడా కుట్రలో భాగస్వామిగా ఆరోపణలున్నాయి.  అటువంటిది ఇంతవరకూ హర్షాను పోలీసులు పెద్దగా పట్టించులేదు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు నిందుతునికి క్యాంటిన్లో ఆశ్రయం కల్పించిన టిడిపి నేత హర్షవర్ధన్ ను మాత్రం ఎందుకు అదుపులోకి తీసుకోలేదు ?

 

 

పైగా క్యాంటిన్ లో పనిచేస్తున్న మిగిలిన సిబ్బందికన్నా శ్రీనివాస్ ను ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు క్యాంటిన్లో పనిచేసే సిబ్బంది ద్వారా తెలుస్తోంది. జీతం కూడా ఎక్కువేనట. పైగా నిందితుడుంటున్న ఇంటికి హర్షానే అద్దె చెల్లిస్తున్నారట. అంత అవసరం ఏంటి అనేదే ప్రశ్న. అందులోను క్యాంటిన్లో పనిచేసే సిబ్బంది లగేజ్ మొత్తం ఒకచోట పెట్టుకుంటుంటే శ్రీనివాస్ మాత్రం క్యాష్ కౌంటర్ దగ్గరే లగేజిని ఎందుకు పెట్టుకుంటున్నట్లు ? హర్ష ఎందుకు అనుమతించారు ?

 

పైగా తన స్వగ్రామమైన ఠాణేలంక వెళ్ళినపుడు గ్రామానికి దగ్గరలోనే నాలుగు ఎకరాలను కోటి రూపాయలకు బేరం చేశాడట. ఈనెలాఖరులో అడ్వాన్సుగా రూ. 10 లక్షలు ఇస్తానని పొలం యజమానితో చెప్పి విశాఖపట్నం వెళ్ళిపోయాడని సమాచారం. ఓ క్యాంటిన్లో పనిచేసే చిన్నపాటి ఉద్యోగికి కోటి రూపాయలతో పొలం కొనగలిగే స్ధాయి ఎక్కడి నుండి వస్తుంది ?

  

అదే సమయంలో శ్రీనివాస్ కు విజయబ్యాంకు, ఆంధ్రాబ్యాంకు, స్టేట్ బ్యాంకుల్లో ఖాతాలున్నాయి. అమలాపురంలోని విజయబ్యాంకులో మూడు నెలల క్రితం రూ 70 వేలు పడింది. అలాగే, కొత్తపేటలోని ఆంధ్రాబ్యాంకు ఖాతాలో ఆరు నెలల క్రితం రూ 1 లక్ష జమైంది. రూ 70 వేలు ఎవరు వేశారు ? లక్ష రూపాయలు వేసిన ఆ ప్రైవేటు ఫైనాన్స్ సంస్ధ ఏది ? ఎందుకు వేసింది ? అన్నది చాలా కీలకంగా మారింది. ఇవన్నీ చూస్తుంటే కోటి రూపాయల సుపారిపై అనుమానాలు పెరిగిపోతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: