ఆపరేషన్ గరుడను తెరపైకి తెచ్చిన నటుడు శివాజి అమెరికాకు పారిపోయాడా ? అవుననే సమాధానం వినిపిస్తోంది వైసిపి నేతల నుండి. వైసిపి ఎంఎల్ఏ రోజా మాట్లాడుతూ, ఆపరేషన్ గరుడ పేరుతో జగన్మోహన్ రెడ్డిని హత్య చేయించేందుకు చంద్రబాబునాయుడు, శివాజి ప్రయత్నించారని రోజా ఆరోపించారు. కాకపోతే వారి ప్లాన్ చివరి నిముషంలో తప్పిపోయిందన్నారు. ఆ కేసులో దొరక్కుండా ఉండేందుకే ప్లాన్ లో భాగమైన శివాజి అమెరికాకు పారిపోయినట్లు మండిపడ్డారు.

 

గతంలో చంద్రబాబు నిర్వహించిన ఓ క్యాబినెట్ సమావేంలో కూడా శివాజి పాల్గొన్నట్లు వార్తలు వచ్చాయని రోజా చెప్పటం గమనార్హం. శివాజికి తెలుగుదేశంపార్టీతో సంబంధం లేకపోతే ఇంతవరకూ అతన్ని ఎందుకు అరెస్టు చేయలేదని రోజా పోలీసులను నిలదీశారు. చంద్రబాబు ఆయన మంత్రుల మాటలు చూస్తుంటే వెగటుపుడుతోందన్నారు. ప్రజలకు, ప్రతిపక్షానికి రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వం కుట్రలు చేస్తున్నట్లు మండిపడ్డారు. ప్రతిపక్ష నేతపై హత్యాయత్నం జరిగితే దాన్ని డ్రామాగా కొట్టి పారేయటం విడ్డూరంగా ఉందన్నారు.

 

విమానాశ్రయంలో జగన్ పై జరిగింది ముమ్మాటికీ హత్యాయత్నమే అని పోలీసులు తమ రిమాండ్ రిపోర్టులో చెప్పటాన్ని ఏమంటారు అని చంద్రబాబును నిలదీశారు. క్రిమినల్ కేసులున్న శ్రీనీవాస్ విమనాశ్రయంలోని క్యాంటిన్లో పనిచేయటానికి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చింది ఎవరన్నారు. క్రిమినల్ రిక్డార్డున్న యువకుడిని తన క్యాంటిన్లో ఉద్యోగిగా హర్షవర్ధన్ ఎలా పెట్టుకుంటారని టిడిపి నేత హర్షాని రోజా నిలదీశారు. హత్యాయత్నం కోణంలో ఘటనను చూడకుండా మొత్తం కేసును చంద్రబాబు తప్పుదోవ పట్టిస్తున్నట్లు ధ్వజమెత్తారు. ఘటనపై విచారణ సరైన దిశగా జరుగుతుందన్న నమ్మకం లేదుకాబట్టే కేంద్ర దర్యాప్తు సంస్ధలు లేదా జ్యుడీషియల్ విచారణను కోరుకుంటున్నట్లు స్పష్టం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: