వైసీపీకి గుండెకాయ లాంటి ఓటు బ్యాంకు చీల్చి చెండాడేందుకు అధికార తెలుగుదేశం కొత్త వ్యూహాలను పన్నుతోందా. జగన్ కి సాలిడ్ గా పడే ఓట్లను పక్క దోవ పట్టించేందుకు రంగం సిధ్ధం చేస్తున్నారా. జగన్ బలాన్ని బద్దలుకొడితే విజయం సులువు అవుతుందని కొత్త ప్లాన్స్ రెడీ చేశారా. ఈ ప్రశ్నలకు సామాధానాం అవును అనే వస్తోందిపుడు.


ఏపీలో బీఎస్పీ :


వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఏనుగు అంబారీ ఎక్కాలని సైకిల్ పార్టీ ముచ్చట పడుతోంది. కేవలం ఉత్తరాదికే పరిమితమైన బీఎస్పీని ఏపీ వైపు తీసుకురావడం ద్వారా కొత్త సమీకరణలకు తెర తీయాలని చంద్రబాబు వ్యూహ రచన చేస్తున్నట్లుగా చెబుతున్నారు. మాయావతి బీఎస్పీ అంటేనే దళితుల పార్టీ. ఆమె దళితులకు ఐకాన్ గా ఉన్నారు. బాబు కంటే ముందే అంటే 1993లోనే దేశంలో అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ కి ముఖ్యమంత్రిగా పనిచేశారు. దేశవ్యాప్తంగా దళీతులకు సుపరిచితమైన పార్టీగా బీఎస్పీకి పేరుంది. అప్పట్లో విశాఖ జిల్లా పాడేరు లో కూడా బీఎస్పీ ఒక సీతు గెలిచింది కూడా.


వైసీపీకి చిల్లు :


ఏపీలో వైసీపీకి ఆయువుపట్టు దళితుల ఓట్లే. కాంగ్రెస్ నుంచి వేరుపడి కొత్త పార్టీ పెట్టిన జగన్ కి అండదండలుగా దళితులే నిలబడ్డారు. 2014 ఎన్నికల్లో బాబు తెలుగుదేశంతో ఢీ అంటే ఢీ అని వైసీపీ పోరాడిందంటే దాని వెనక దళితుల ఓట్లు దన్నుగా ఉండబట్టేనని అంటారు. ఓ వైపు దళీతులు, మరో వైపు మైనారిటీలు జగన్ పార్టీకి మద్దతుగా ఉంటే అజేయంగా ఎన్నికల్లో  ఆ పార్టీ నిలవడం ఖాయం. దీంతో ఆ రెండు వర్గాలను విడదీసేందుకు వైసీపీ చాలాకాలంగా ట్రై చేస్తోంది.


లోపాయికారి అవగాహన :


వచ్చే ఎన్నికల్లో ఏపీలోని మొత్తం 175 అసెంలీ సీట్లలో బీఎస్పీ పోటీ చేసేలా టీడీపీ పక్కా ప్లాన్ వేస్తోంది.  ఆ ప్లాన్ ప్రకారం టీడీపీతో సంబంధం లేకుండా వేరుగానే ఆ పార్టీ బరిలోకి దిగుతుంది. దళిత్ కార్డ్ తో దిగే ఆ పార్టీకి నిధులు, ప్రచారం ఇతరత్రా టీడీపీ తెరవెనక చూసుకునేలా ఏర్పాట్లు జరుగుతున్నాయట. నియోజకవర్గానికి కనీసం వేయి నుంచి రెండు వేల ఓట్లు బీఎస్పీ అభ్యర్ధులు చీల్చినా అది వైసీపీకి భారీగానే చేటు తెస్తుందని, ఆ తేడాను సొమ్ము  చేసుకుని టీడీపీ అభ్యర్ధులు విజయం సాధిస్తారని టీడీపీ వ్యూహకర్తలు పధ‌కరచన చేస్తున్నారు. మరి ఎంత వరకు ఇది వర్కౌట్ అవుతుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: