వైసీపీ అధినేత జగన్ పాదాత్ర చేస్తూనే అభ్యర్ధులను ఎక్కడికక్కడ ఎంపిక చేసుకుంటున్నారు. టీడీపీ బలాబలాలను అంచనా వేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. జగన్ స్వయంగా క్షేత్రస్థాయిలో అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ ఇతర పార్టీలలోని సమర్ధులను కూడా పార్టీలోకి తెచ్చేందుకు రెడీ అవుతున్నారు. 


శ్రీకాకుళం హాట్ సీటు:


ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం హాట్ ఫేవరేట్ సీటు గా ఉంది, మహామహులు ఇక్కడ నుంచి పోటీ చేశారు. ఆలగే కేంద్రంలో మంత్రులుగా, కీలక నాయకులుగా కూడా ఎదిగారు. ఈ సీటు పేరు చెప్పగానే బొడ్డేపల్లి రాజగోపాల్, కింజరపు ఎర్రన్నాయుడు, పాలవలస రాజశేఖరం  కణితి విశ్వనాధంవంటి వారు గురుతుకు వస్తారు. ఆలాగే వర్తమాన రాజకీయాల్లో కేంద్ర మాజీ మంత్రి కిల్లి క్రుపారాణి కూడా ఈ వరసలో ఉంటారు.


వైసీపీలోకి ఖాయం :


కాంగ్రెస్ లో ప్రస్తుతం ఉన్న క్రుపారాణి వైసీపీలోకి రావాలనుకుంటున్నారు. చాలాకాలంగా ఈ వ్యవహారం నలుగుతోంది. చిత్రమేంటంటే ఇటు జగన్ సైతం ఆమె రాకను స్వాగతిస్తున్నారు. కానీ సీటు దగ్గరే పేచీ వస్తోంది. జగన్ ఆమెను శ్రీకాకుళం లోక్ సభ బరిలోకి దించాలనుకుంటున్నారు. ఆమె టెక్కలి అసెంబ్లీ నుంచి పోటీ చేస్తానని అంటున్నారు. తొందరలోనే ఈ పీట ముడి విడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.


జగన్ పాదయాత్రలో ముహూర్తం :


కిల్లి క్రుపారాణి జగన్ పాదయాత్రలో వైసీపీలో చేరిపోతారని జోరుగా ప్రచారం సాగుతోంది. జగన్ వచ్చే నెల రెండవ వారంలో శ్రీకాకుళం జిల్లాలోకి ప్రవేశిస్తారు. ఈ సందర్భంగా ఆమె పార్టీ తీర్ధం పుచ్చుకుంటారని తెలుస్తోంది. ఆమెను సిక్కోలు నుంచి ఎంపీ క్యాండిడేట్ గానే జగన్ బరిలోకి దింపుతారని అంటున్నారు. ఈ మేరకు ఆమెను ఒప్పిస్తారని కూడా అంటున్నారు. వైసీపీలో ఆమె చేరితే సరైన అభ్యర్ధి అవుతారని జగన్ ఆలొచన చేస్తున్నారు. మరి చూడాలి ఏం జరుగుతుందో.


మరింత సమాచారం తెలుసుకోండి: