జగన్మోహన్ రెడ్డి హత్యాయత్నంపై విచారించిన సిఐఎస్ఎఫ్ నివేదిక సంచలనం సృష్టిస్తోంది. మొన్న 25వ తేదీన విశాఖపట్నం విమానాశ్రయంలో జగన్ పై శ్రీనివాస్ అనే యువకుడు కత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే. హత్యాయత్నం తర్వాత తెలెత్తిన రాజకీయ పరిణామాలు ఎలాగున్నా వెంటనే రెండు బృందాలు దర్యాప్తును మొదలుపెట్టాయి. మొదటిదేమో కేంద్రప్రభుత్వం ఆద్వర్యంలోని సిఐఎస్ఎఫ్ విచారణ. ఇక, రెండోదేమో రాష్ట్రప్రభుత్వం నియమించిన సిట్.


మొదటి విచారణ బృందమేమో నిందితుడు శ్రీనివాస్ ను విచారించి ఐదు రోజుల తర్వాత తన నివేదికను కేంద్రప్రభుత్వానికి అందచేసింది. విచారణలో భాగంగా శ్రీనివాస్ తో పాటు అతను పనిచేసిన ఫ్యూజన్ ఫుడ్స్ క్యాంటిన్ ఓనర్, టిడిపి నేత హర్షవర్ధన్ తో పాటు మరో 100 మందిని దాకా విచారించారు. వారి విచారణలో జగన్ పై జరిగిన దాడి హత్యకు కుట్రగానే తేల్చేరాట. కాకపోతే హత్యకు కుట్రపన్నిన సూత్రదారులెవరు ? ఎందుకు కుట్రపన్నారు ? శ్రీనివాస్ నే ఎందుకు ఎంచుకున్నారు ? హత్యకు ఎంతకు సుపారి మాట్లాడుకున్నారు ? విమానాశ్రయాన్నే ఎందుకు ఎంచుకున్నారు ? లాంటి విషయాలు తేలాల్సుందని నివేదికలో చెప్పారట.

 

అదే సమయంలో మధ్యాహ్నం తాము నిందితుడిని పట్టుకున్నపుడు లేని లేఖ సాయంత్రానికి ఎలా వచ్చిందో తెలీటం లేదని చెప్పారట. దాడి జరిగిన వెంటనే సిఐఎస్ఎఫ్ సిబ్బంది నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రాధమికంగా విచారించి సాయంత్రానికి పోలీసులకు హ్యాండోవర్  చేశారు. సాయంత్రం విచారణ తర్వాత శ్రీనివాస్ జేబులో 11 పేజీల ఉత్తరం దొరికిందని పోలీసులు ప్రకటించారు. దాంతో సిఐఎస్ఎఫ్ సిబ్బంది ఆశ్చర్యపోయారు. అయితే, నిందితుడి దగ్గర లేఖ దొరికిందని  పోలీసులు చేసిన ప్రకటనకు మద్దతుగా సిఐఎస్ఎఫ్ అధికారులు సంతకం చేయటాన్ని కూడా విచారణ అధికారి తప్పుపట్టినట్లు సమాచారం. మొత్తం మీద జగన్ పై దాడిని సిఐఎస్ఎఫ్ విచారణ మాత్రం హత్యాయత్నంగానే తేల్చేసింది. ఇక సిట్ బృందం తమ నివేదికలో ఏమి చెబుతుందో చూడాలి.

 


మరింత సమాచారం తెలుసుకోండి: