దీపావళి పండుగను తెలుగువారు ఘనంగా చేసుకుంటారు. ముఖ్యంగా అంధ్ర ప్రదేశ్ లో ఈ వేడుక చాల అట్టహాసంగా జరుపుకుంటారు. దీపావళి అంటే సిరులు పండుగగా భావిస్తారు. లక్ష్మీదేవిని పూజించడం సంప్రదాయంగా ఉంది. ఆ రోజున సంపదలు కోరుకునే వారంతా లక్ష్మీదేవిని ఆరాధిస్తారు.


వేకువజామునే నిద్రలేచి ఇంటిని పరిశుభ్రంగా తయారుచేసుకుంటారు. ఇంటిలోని పూజా మందిరాన్ని కూడా సర్వాంగ సుందరంగా అలంకరించి లక్ష్మీదేవిని కొలువు తీరుస్తారు. ఐశ్వర్య ప్రదాయినిగా పేరున్న ఆ తల్లిని కొలిస్తే సమస్త సంపదలు వస్తాయని నమ్మకం. శాస్రోక్తంగా పూజలు చేసి పలు రకాలైన పిండివంటలతో ఆ తల్లికి నైవేద్యం పెడతారు.


దీపం అంటేనే లక్ష్మీదేవి అన్నది ప్రజల విశ్వాసం, . అలా దీపాల వరసను పేర్చితే ఆ లోగిళ్ళు కళకళలాడుతూ లక్ష్మీదేవి వచ్చేందుకు ఇష్టపడుతుందని భావిస్తారు. అందువల్ల ఉదయం పూజామందిరంలో దీపాలను వెలిగించడం అయ్యాక సాయంత్రం ఇంటికి నలువైపులా దీపాలతో వెలుగుల పండుగను తీసుకువస్తారు.


ఇక మరో వైపు బాణాసంచా సరంజామా కూడా సిధ్ధం చేసుకుంటారు. దీపావళి పండుగ రావడానికి కారణమైన న‌రకాసురుని కధని దక్షినాదివారు బాగా నమ్ముతారు. నరకాసురుడు శ్రీక్రిష్ణుడితో యుధ్ధం చేస్తూంటాడు. అపుడు క్రిష్ణుడు ఓ బాణానికి సొమ్మసిల్లిపోగా పక్కన ఉన్న సత్యభామ కోపంతో విల్లంబులు పట్టి నరకున్ని వధిస్తుంది.ఆలా నరకాసురుడు అంతాన్ని గుర్తు చేసుకుంటూ మందుగుండు సామగ్రిని కాల్చడం ద్వారా లోకకంటకుని పీడను వదిలించాలని కోరుకుంటారు.  మొత్తానికి లక్ష్మీదేవి అవతారమైన సత్యభామను స్మరిస్తూ, విష్ణుమూర్తి అవతారమైన శ్రీక్రుష్ణున్ని కొలుస్తూ దీపావళి దీపావళి పండుగను కడు వేడుకగా జరుపుకుంతారు. పిండివంటలతో విందారగించి అంతా సుఖ సంతోషాలతో కాలం గడుపుతారు.


మరింత సమాచారం తెలుసుకోండి: