జగన్ మోహన్ రెడ్డి తన మీద జరిగిన దాడి గురించి హై కోర్ట్ లో కేసు వేశాడు. ఈ రోజు కోర్ట్ విచారించ బోతుంది. జగన్ఏ ఏం చెప్పారంటే , ఏపీ ప్రభుత్వం వైఫల్యం వల్లే తనపై దాడి జరిగిందని చెప్పారు. అలాగే కేసు సక్రమంగా జరపడంలో ప్రభుత్వం విఫలమైందని పేర్కొన్నారు. కేంద్ర దర్యాఫ్తు సంస్థతో విచారణ జరగాలని డిమాండ్ చేశారు. కేసును ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందని పేర్కొన్నారు. ఇందులో ప్రతివాదిగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పేరును చేర్చారు. మొత్తం 8 మందిని చేర్చారు. చంద్రబాబుతో పాటు డీజీపీ, విశాఖ ఏసీపీ, ఎయిర్ పోర్టు పీఎస్ ఎస్‌హెచ్ఓ తదితరులను పేర్కొన్నారు.

Image result for jagan attack

శ్రీనివాస్ దగ్గర స్వాధీనం చేసుకున్న లేఖలో మూడు చేతి రాతలు ఉన్నాయని జగన్ పేర్కొన్నారు. నేరుగా తన మెడపై దాడి చేయబోయాడని, ప్రతిఘటించడంతో భుజానికి గాయమైందన్నారు. కేసు త్వరగా క్లోజ్ చేసేందుకు నార్త్ విశాఖ ఏసీపీని నియమించారని చెప్పారు. నాపై హత్యాయత్నం జరిగిందని స్వయంగా పోలీసులే రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారని చెప్పారు. తనపై దాడి కేసును గురించి పేర్కొంటి, దర్యాఫ్తులో కుట్ర కోణాన్ని విస్మరించారని జగన్ పేర్కొన్నారు. కుట్ర కోణాన్ని సజావుగా దర్యాఫ్తు చేయాలని హైకోర్టుకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఇది ఈ రోజు  విచారణకు వచ్చే అవకాశముంది. తాను ప్రజా సంకల్ప యాత్ర పేరుతో ఏపీలో పాదయాత్ర చేస్తున్నానని, ప్రభుత్వ వైఫల్యాలను, తప్పిదాలను, పాలకుల అక్రమాలను ప్రజల్లోకి తీసుకు వెళ్తున్నానని జగన్ చెప్పారు.

Image result for jagan attack

చంద్రబాబు సర్కారు, టీడీపీ దుర్మార్గాలను ఎండగడుతున్నానని జగన్ చెప్పారు. ఆపరేషన్ గరుడ పేరుతో ఓ కొత్త నాటకాన్ని తెరపైకి టీడీపీ నేతలు తెచ్చారని అన్నారు. ఏపీ ప్రభుత్వాన్ని కేంద్రం పడగొట్టే ప్లాన్ అంటూ చెబుతున్నారని, టీడీపీ సానుభూతిపరుడైన నటుడు శివాజీయే ఆపరేషన్ గరుడ సూత్రధారి అన్నారు. పాదయాత్రలో నాపై ఓ దాడి చేస్తారని శివాజీ గతంలో ప్రకటించారని చెప్పారు. టీడీపీ ప్రభుత్వం పతనానికి అది దారి తీస్తుందని శివాజీ అప్పుడు చెప్పారని జగన్ పేర్కొన్నారు. తాజా పరిణామాలు చూస్తుంటే ఇదొక భారీ కుట్ర అని అర్థమవుతోందని ఆయన పేర్కొన్నారు. ప్రతిపక్ష నేతను హత్య చేసి ఆఫరేషన్ గరుడలో భాగమని చెప్పే ప్రయత్నమని ఆయన ఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: