జగన్ మీద దాడి ని  టీడీపీ నాయకులూ రాజకీయంగా వాడుకోవాలని చూడటం ప్రజలు కు అసహనాన్ని కలిగిస్తుంది. అయితే చంద్ర బాబు కు చెక్ పెట్టడానికి జగన్ పవన్ లు కలిసి పోతున్నారని మాటలు వినిపిస్తున్నాయి.  పొత్తులపై వైఎస్ఆర్సీ పార్టీ అధినేత జగన్ వద్దకు ఓ రాయబారం వెళ్లినట్టు సమాచారం. చిరంజీవి, బొత్స సత్యనారాయణ ఈ ఎపిసోడ్ లో ముఖ్యపాత్రలు పోషిస్తున్నారట. జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ కీలకనేత ఒకరు సన్నిహితుల వద్ద దీన్ని ధృవీకరించారు కూడా. అయితే ఇరువర్గాలు కూడా దీనిపై ఎలాంటి లీకులు రాకుండా ఇప్పటివరకూ గుంభనంగానే ఉన్నారు.

జగన్ దగ్గరకు జనసేనాని రాయబారం?

జగన్, పవన్ కలిస్తే ఎవరికి లాభం, ఎవరికి నష్టం అనే విషయంపైనే తర్జన భర్జనలు జరుగుతున్నాయి. అధికార పక్షానికి మాత్రం ఇది తీరని నష్టమే. చంద్రబాబు నక్కజిత్తుల వల్ల జగన్ కు ఎమ్మెల్యేల బలం తగ్గినా, ప్రజాబలం అనూహ్యంగా పెరిగింది. పవన్ కూడా యాత్రల పేరుతో జనాల్లోకి వెళ్లి హడావుడి చేస్తున్నారు, తన సామాజిక వర్గ ఓట్లను చెల్లాచెదరు కాకుండా చూడటంలో కాస్త సక్సెస్ అయ్యారు.

Image result for jagan and pavan

ఇదే టైమ్ లో జగన్ హత్యకు కుట్ర జరిగి రాష్ట్రంలో కలకలం రేగింది. తాను తీసిన గోతిలో తానేపడిన చంద్రబాబు అండ్ టీమ్ ఎలా బైటకు రావాలో తెలియక గిలగిలా కొట్టుకుంటుంటే.. సంయమనానికి మారుపేరులా నిలిచిన వైసీపీ, రాష్ట్ర ప్రజల దృష్టిలో మరో మెట్టు పైకెదిగింది. దాడిలో గాయపడ్డ జగన్ పై సింపతీ సంగతి పక్కనపెడితే, దాడి తర్వాత జరిగిన, జరుగుతున్న నీచ రాజకీయాలన్నీ జనం దృష్టిలో టీడీపీని పూర్తిగా పల్చనచేశాయి. అదే సమయంలో జగన్ లో నిజాయితీ, నిర్భీతి గల నేతను మరోసారి ప్రజలకు పరిచయం చేశాయి. ఇలాంటి టైమ్ లో వైసీపీతో కలిసి నడిస్తే బాగుంటుందని జనసేన భావిస్తున్నట్టు లీకులు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: