సరిగ్గా నలభయ్యేళ్ళ క్రితం అంటే 1978లో కాంగ్రెస్ పార్టీలో చిత్తూరు జిల్లాకు చెందిన ఓ విధ్యార్ధి నాయకుడు చేరి తొలి ప్రయత్నంలోనే ఎమ్మెల్యేగా నెగ్గారు. ఏకంగా నాటి కాంగ్రెస్ దిగ్గజం, తనకు రాజకీయ గురువు రాజగోపాల్ నాయుడుని  ఓడించి రికార్డ్ స్త్రుష్టించారు. అంతేనా ఆ తరువాత రెండేళ్ళకు కాంగ్రెస్ లో మంత్రిగానూ పదోన్నతి పొందారు. ఆ హోదాలో ఉండగానే అప్పటి సినీ నటుడు నందమూరి తారక రామారావు తో వియ్యమంది కూతురుని పెళ్ళి చేసుకున్నారు.  ఇక  1983లో కాంగ్రెస్ ఓడి టీడీపీ గెలిచాక మూటా ముల్లే సర్దుకుని బాబు మమ గారింట చేరి తెలుగుదేశం పార్టీనే శాసించే స్థాయికి ఎదిగారు.


సీన్ కట్ చేస్తే :


నాలుగు దశాబ్దాలు ఇలా తిరిగిపోయాయి. భూమి గుండ్రంగా ఉంటుందని చాటి చెబుతూ చంద్రబాబునాయుడు అదే కాంగ్రెస్ గూటికి వెళ్ళిపోయారు.  అది 1978, నడుస్తున్న ఏడాది 2018. అపుడూ ఇపుడూ చివర 8 నంబర్ ఉంది. నాడు యువకుడుగా ఇందిరాగాధి నాయకత్వంలోని కాంగ్రెస్ నీడన చేరితే నేడు ఆమె మనవడు రాహుల్ గాంధీతో కరచాలనం చేయడం ద్వారా చంద్రబాబు నాటి రుణాన్ని మరచిపోలేదని గట్టిగా చెప్పారు.


పిల్ల కాంగ్రెస్ అందామా :


ఆరునెలల క్రితం వరకూ పిల్ల కాంగ్రెస్ తల్లి కాంగ్రెస్ అంటూ చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్ ప్రతి మీటింగులోనూ ఎకసెక్కం ఆడేవారు, అక్కడ మొద్దబ్బాయి, ఇక్కడ దొంగబ్బాయి అంటూ రాహుల్, జగన్ లను కలిపి లోకేష్ సెటైర్లూ వేసేవారు. ఇంకవైపు ఏపీకి అవతరణ దినం అన్నది లేకుండా చేసి జనం కాంగ్రెస్ చేసిన పనికి కలకాలం కసిగానే ఉండాలని కోరుకున్న పౌరుషవంతుడు చంద్రబాబు. మాటకు వస్తే చాలు కట్టు బట్టలతో విసిరేసారు, అడ్డగోలు గా విభజించారు. ఇటలీ మాఫియా అంటూ కాంగ్రెస్ పై ఘాటు విమర్శలు చేసిన చంద్రబాబు హటాత్తుగా కాంగ్రెస్ కౌగిలిలోకి చేరిపోయారు.


ప్రజాస్వామ్య పరిరక్షణ :


ఈ దేశంలో ప్రజాస్వామ్యం పరిహసించబడిందే కాంగ్రెస్ తో పూర్తి మెజారిటీ ఉన్న అన్న గారి ప్రభుత్వాన్ని గవర్నర్ ని అడ్డం పెట్టుకుని కూల్చేసిన కాంగ్రెస్ ని అంత తేలిగ్గా జనం మరువరు కదా. డిల్లీకి బానిసలుగా  కాంగ్రెస్  ముఖ్యమంత్రులను చేసిన చరిత్ర కళ్ళ ముందే ఉంది కదా. అసలు అన్ని వ్యవస్థలూ ఇలా తయారవడానికి మూల కారణం ఆ పార్టీయే కదా. అంతెందుకు ఎమర్జెన్సీ విధించి ప్రజాస్వామ్యం పీక నొక్కినది కూడా ఆ పార్టీయే కదా. అటువంటి కాంగ్రెస్ తో కలసి ప్రజాస్వామ్యం పరిరక్షిస్తానని బాబు చెప్పడం చూస్తూంటే ఇంతకంటే అవకాశ వాదం ఉంటుందా అనిపించకమానదు. ఈ కలయిక వల్ల జరిగే పరిణామాలు తరువాత కాలంలో తెలుస్తాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: