ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏపీలో తన ఉనికిని చాటుకోవడానికి విశ్వ ప్రయత్నాలు ఉంది. ఒకపక్క చంద్రబాబు ప్రభుత్వం పై విమర్శలు ఎక్కువ పెడుతూ ఏపీ ప్రజల మన్ననలు అందుకోవాలని పరితపిస్తున్న కాంగ్రెస్ పార్టీని ఇప్పటికీ ఏపీ ప్రజలు అక్కున చేర్చుకోవడం లేదు. ఈ క్రమంలోనే మెల్ల మెల్లగా సీనియర్ కాంగ్రెస్ నేతలతో సంప్రదింపులు జరుపుతూ ఏపీలో ఎలాగైనా కాంగ్రెస్ జెండా వేయాలని పరితపిస్తున్న కాంగ్రెస్ అధిష్టానం సీనియర్ నేతలను మళ్లీ రంగంలోకి దింపుతోంది. ఈ క్రమంలోనే మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించింది మరికొందరు సీనియర్ నేతలు కూడా కాంగ్రెస్ పార్టీలో ప్రియా శీలకంగా వ్యవహరించాలని ప్రయత్నిస్తున్న తరుణంలో ఏపీలో మళ్లీ కాంగ్రెస్ పార్టీ తన పునర్వైభవాన్ని చాటాలని వెళ్ళుతున్న సమయంలో ఒక్కసారిగా చంద్రబాబు ఎంట్రీ కాంగ్రెస్ పై తీవ్ర ప్రభావాన్ని చూపింది.

 Image result for vatti vasanth kumar

చంద్రబాబు నాయుడు రాహుల్ గాంధీ ని కలిసి చర్చలు జరిగిన నేపథ్యంలో ఏపీ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సీనియర్ మంత్రి అయినా వట్టి వసంత కుమార్ కాంగ్రెస్ పార్టీకి తన పదవులకు రాజీనామా చేశారు. మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ టిడిపితో కలవడాన్ని వట్టి వసంత్ నిరసిస్తూ రాజీనామా చేస్తున్నట్లు గా ప్రకటించారు తన రాజీనామా లేఖను శుక్రవారం ఏపీ కాంగ్రెస్ అధ్యక్షులు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఈ మెయిల్ ద్వారా పంపనున్నట్లు సమాచారం తెలుస్తోంది ఇదిలా ఉంటే.

 Image result for vatti vasanth kumar

వట్టి వసంత్ రాజీనామాను వెనక్కి తీసుకోవాలని అందుకుగాను రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేతలు అందరూ పట్టుబడుతున్నారు..కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలని వట్టి దగ్గరకి పంపి బుజ్జగించే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు కాంగ్రెస్ పెద్దలు..అయితే ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలోకి మళ్ళీ వెళ్ళే అవకాసం లేదని వట్టి తేల్చి చెప్పినట్టుగా తెలుస్తోంది..ఇదిలాఉంటే ఇప్పుడు వట్టి వసంత్ వైసీపీలోకి వెళ్తారా లేక జనసేన పార్టీలోకి వెళ్తారా అనేది సస్పెన్స్ గా గా మారింది..


మరింత సమాచారం తెలుసుకోండి: