తెలుగు జాతికి పౌరుషం, ఆత్మాభిమానం నిండుగా ఉన్నాయని, వాటికి ఎవరు తాకట్టు పెట్టిన జనం సహించబోరని జనసేనాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అడ్డగోలుగా కాంగ్రెస్ ఉమ్మడి ఏపీని విభజిస్తే ఆ పార్టీతో పొత్తు కోసం వెంపర్లాడతారా అంటూ చంద్రబాబుని నిలదీశారు. తెలుగుదేశం ఎంపీలను కొట్టించిన పార్టీని కౌగలించుకోవడమేంటని ప్రశ్నించారు. ఈ రోజు జరిగిన  తుని సభలో  బాబుపై పవన్ షాకింగ్ కామెంట్స్ చేశారు.


అధికారమే పరమావధా :


ఎంతసేపూ అధికారం చుట్టూనే  మీ రాజకీయం తిరుగుతుందా, ప్రజలకు మేలు చేయలని కనీసం అనిపించదా అంటూ పవన్ మండిపడ్డారు. కాంగ్రెస్ ని ఇంతవరకు తిట్టి ఇపుడు వాళ్ళతో కలసి పొటోలు దిగడానికి మనసెలా వచ్చిందని పవన్ నిగ్గదీశారు. జాతీయ పార్టీలు రెండూ ఏపీకి తీరని అన్యాయం చేశాయని పవన్ విరుచుకుపడ్డారు. అటువంటి పార్టీలతో జత కట్టడం ద్వారా బాబు కూడా ఏపీకి ద్రోహం చేశారని ఫైర్ అయ్యారు.


బాబు లాంటి వారు కావాలా:


చంద్రబాబు లాంటి వారు ఈ రాష్ట్రానికి అవసరమా అని పవన్ తుని వద్ద జరిగిన బహిరంగ సభలో జనాలను ప్రశ్నించారు. కేవలం రెండు వేల రూపాయలు తీసుకుని ఓటు వేయలనుకుంటే ఈ నాయకులు మన బతుకులు కూడా తాకట్టు పెడతారని పవన్ హెచ్చరించారు. ఏపీకి ఏమీ చేయకుండా రాజకీయమే జీవితం అనుకుంటున్న టీడీపీకి 2019 ఎన్నికల్లో ప్రజలు తమ కోపాన్ని ఓటు ద్వారా చూపించి గద్దె దించుతారని పవన్ స్పష్టం చేశారు. మొత్తానికి పవన్ బాబు పైన గట్టినాగే ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ తో పొత్తుని ఏకి పారేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: