ఈరోజు ఉదయం పోలవరం ప్రాజెక్టు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజల్లో ఒక్కసారిగా పెద్ద ఎత్తున అలజడి రేగింది. ఏం జరుగుతోందో అర్ధం కావటం లేదు. ఒక్కసారిగా భూమి కంపించింది. కొన్నిచోట్ల భూమి లోపలకు క్రుంగిపోతే మరికొన్ని చోట్ల భూమి పైకి ఉబ్బంది. భూ ప్రంకపనల కారణంగా చుట్టుపక్కల వేసిన రోడ్లు ధ్వసమయ్యాయి. మరికొన్ని చోట్ల విద్యుత్ స్తంభాలు పక్కకు వాలిపోయాయి. ఇదంతా కూడా కేవలం నిముషాల వ్యవధిలో జరిగిపోవటంతో ప్రాజెక్టు చుట్టుపక్కలున్న గిరిజన గ్రామాల ప్రజలు ఒక్కసారిగా అదిరిపోయారు. భయంతో ఇళ్ళలో నుండి, పనిచేస్తున్న ప్రాంతాల నుండి దూరంగా పారిపోయారు. పోలవరం ప్రాజెక్టు మెటీరియల్ తీసుకువస్తున్న వాహనాలను డ్రైవర్లు ఎక్కడివక్కడ ఆపేసి దూరంగా పారిపోయారు. దాంతో ప్రాజెక్టు చుట్టుపక్కల అసలేం జరుగుతోందో ఎవరికీ అర్ధం కాలేదు.

 

ప్రాజెక్టు ప్రాంతంలో భూ ప్రకంపనల దెబ్బకు పెద్ద ఎత్తున భూకంపం వచ్చిందనే వదంతులతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలంతా ఆందోళన పడుతున్నారు. విషయం తెలుసుకున్న వెంటనే ముందు జాగ్రత్తగా పోలీసులు ప్రాజెక్టు ప్రాంతంతో పాటు గిరిజన గ్రామాలకు కూడా రాకపోకలు నిలిపేశారు.   భూ ప్రకంపనల విషయం తెలియగానే పోలవరం ప్రాజెక్టు సైట్ ఇంజనీర్లు కూడా ఒక్కసారిగా భూమి నెర్రెలుబారిన ప్రాంతాన్ని పరిశీలించారు. భూ వాతావరణంలో తీవ్రమైన మార్పులు చోటు చేసుకోవటం వల్లే రోడ్లు కొన్ని ప్రాంతాల్లో పైకి ఉబ్బినట్లు ఇంజనీర్లు ప్రధామిక అంచనాకు వచ్చారు. భూమి లోపలకు క్రుంగిపోయిన ప్రాంతాల్లో కూడా భూమిలోపల చోటుచేసుకున్న మార్పులే కారణమని తేల్చారు.

 

ప్రాజెక్టుకు సమీపంలోనే రోడ్డు పక్కనే ఉన్న డంపింగ్ యార్డు కారణంగానే భూమి నెర్రెలుబారినట్లు అధికారులు  తేల్చేశారు. మరి, భూమి లోపలకు క్రుంగిపోయిన చోట్ల కారణాలేంటనే విషయం తేలాలి. డంపింగ్ యార్డు వల్లే భూమి లోపల ఇంత భారీ స్ధాయిలో మార్పులు సంభవిస్తాయా అన్న అనుమానం మొదలైంది చాలామందిలో.  ఒకవేళ అదే నిజమైతే ఇఫుడు ప్రాజెక్టు చుట్టుపక్కల ప్రాంతాల్లో భూమిలో వాతావరణం కనిపించింది. అదే ప్రాజెక్టు పనులు జరుగుతున్న ప్రాంతంలోనో లేకపోతే ప్రాజెక్టు మధ్యలోనో భూమిలోపల మార్పులు చోటు చేసుకుంటే పరిణామాలు ఎలాగుంటాయో అంచనా వేయలేకన్నారు. మొత్తం మీద ఈరోజు జరిగిన పరిణామాలతో ప్రాజెక్టు ప్రాంతం ఏమేరకు సేఫ్ అనే అంశంపై చర్చలు జోరుగా మొదలైంది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: