Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sat, Jan 19, 2019 | Last Updated 2:02 am IST

Menu &Sections

Search

పవన్ అక్కర్లేదు? కాపు ఓట్ల కోసం ప్రముఖ వ్యక్తిని రంగంలోకి దింపిన బాబు !!

పవన్ అక్కర్లేదు? కాపు ఓట్ల కోసం ప్రముఖ వ్యక్తిని రంగంలోకి దింపిన బాబు !!
పవన్ అక్కర్లేదు? కాపు ఓట్ల కోసం ప్రముఖ వ్యక్తిని రంగంలోకి దింపిన బాబు !!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కాస్తంత ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటున్న క్రమంలో రాబోయే ఎన్నికలలో బాగా కష్టపడితే గానీ విజయం అందుకోలేని నేపద్యంలో ఏపీ సీఎం చంద్రబాబు వ్యూహాలు ప్రతివ్యూహాలతో 2019 ఎన్నికలకు టిడిపిని అన్ని విధాల సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో 2014 ఎన్నికల్లో కాపు ఓటు బ్యాంకు మొత్తం పవన్ కళ్యాణ్ వల్ల టిడిపి వైపు మళ్లడం తో  విజయం ఆ సమయంలో నల్లేరు మీద నడక లాగా సాగింది. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ టీడీపీ ని వ్యతిరేకించి రానున్న ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తున్న నేపథ్యంలో కాపు ఓటు బ్యాంకు మొత్తం చీలుస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.
aamanchi-pawan-kalyan-ap-chandrababu-kapu-otubank
అయితే ఇలాంటి ఆసక్తికర నేపధ్యం లో చంద్రబాబు చాణిక్యుడు లా వ్యవహరించి పవన్ కళ్యాణ్ కి ప్రత్యామ్నాయం గా ఉండే కాపు సామాజిక వర్గానికి చెందిన నేత అయిన ఆమంచి కృష్ణమోహన్ ని తెర మీదకి తీసుకు వచ్చారు. మొదటి నుంచీ ఆమంచి ఏ పార్టీ లో ఉంటె ఆ పార్టీ కి ఆయన నియోజికవర్గం తో పాటు చుట్టుపక్కల ప్రాంతాలు , మొత్తం జిల్లాని సైతం ప్రభావితం చెయ్యగల నేతగా ఎదుగుతూ వచ్చారు ఆయన. రానున్న ఎన్నికల్లో రాజధాని పరిసర ప్రాంతాల్లో మరియు ప్రకాశం జిల్లాలలో కాపు సామాజిక ఓట్లు మొత్తం ఆమంచి కృష్ణమోహన్ వ్యవహార శైలి పైన ఆధారపడి ఉంటున్న నేపద్యంలో చంద్రబాబు 2019 ఎన్నికలలో కాపు ఓటు బ్యాంకును తిరిగి టిడిపి వైపు మళ్లించడానికి ఆమంచి కృష్ణమోహన్ ని అన్ని విధాల రెడీ చేస్తున్నారు.
aamanchi-pawan-kalyan-ap-chandrababu-kapu-otubank
కాపులలో పవన్ కళ్యాణ్ తరవాత రాష్ట్రం లో అంత గా సపోర్ట్ ఉన్న నాయకుడు ఆమంచి అని సీనియర్ విశ్లేషకులు ఎప్పుడూ చెబుతూ ఉంటారు. అలాంటి ఆమంచి ని పార్టీ నుంచి వెళ్లి పోకుండా ఉండేలా బాబు చాలా ప్రయత్నాలే చేస్తున్నారు ఎప్పటి నుంచో.  2014 ఎన్నికల్లో చీరాల నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఆ సమయంలో నువ్వానేనా అన్నట్టుగా ఉన్న టిడిపి -వైసిపి పార్టీలను వెనక్కి తన్ని భారీ మెజారిటీ సాధించిన ఆమంచి  దమ్ము చూసి చంద్రబాబు స్వయంగా ఆమంచి కృష్ణమోహన్ కి తెలుగుదేశం పార్టీలో కి సాదరంగా ఆహ్వానించి పార్టీలో సముచిత స్థానం కల్పించడం జరిగింది. అప్పటి బాబు ఆలోచన మున్ముందు టీడీపీ కి అత్యంత ఆవస్యకర పరిస్థితి అవుతుంది అని ఎవ్వరూ ఊహించి ఉండరు.

aamanchi-pawan-kalyan-ap-chandrababu-kapu-otubank
అయితే ప్రస్తుత పరిస్థితుల్లో పవన్ కాపు ఓటు బ్యాంకు మొత్తం తన వైపు లాక్కోవడానికి ప్రయత్నిస్తున్న నేపద్యంలో చంద్రబాబు పవన్ కి ధీటుగా ఉండే ఆ మంచిని రంగంలోకి దింపి 2014 ఎన్నికల్లో టిడిపి వైపు వచ్చిన కాపు ఓటుబ్యాంకును చేజారిపోకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కాపుల ఓట్ల తోనే వచ్చే ఎన్నికల్లో గెలుపు అనేది అనివార్యం ఐన నేపధ్యం లో బీజేపీ నుంచి ప్రతీ చిన్న పార్టీ వాళ్ళ వైపే పాజిటివి అడుగులు వేస్తోంది.  ప్రస్తుతం విభజన తో నష్టపోయిన ఆంధ్రరాష్ట్రంలో చీరాల మరియు పరిసర ప్రాంతాలలో తనదైన శైలిలో పార్టీలకతీతంగా అభివృద్ధిని చేసుకుంటూ వెళ్ళిపోతున్న ఆమంచి కృష్ణమోహన్ కి కాపు సామాజిక వర్గం లో మొదటి నుంచీ మంచి పేరు ఉంది.
aamanchi-pawan-kalyan-ap-chandrababu-kapu-otubank
గతంలో టిడిపి ని బండ బూతులు తిట్టి బయటకు వచ్చిన పవన్ కళ్యాణ్ తనతో చేతులు కలపాలని..మనపార్టీ అధికారంలోకి వస్తే సరైన స్థానం కల్పిస్తానని ఆఫర్ ఇచ్చినా కానీ..ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దృష్ట్యా నష్టపోయిన రాష్ట్రంలో చంద్రబాబు మాత్రమే అభివృద్ధి చేస్తాడు అని గట్టిగా నమ్మడంతో ఆమంచి తన స్టాండ్ మార్చుకోకుండా తెలుగుదేశం పార్టీలో కొనసాగడం జరిగింది. ఈ క్రమంలో పార్టీకి అంత నమ్మకంగా ఉన్న ఆమంచి కృష్ణమోహన్ రానున్న ఎన్నికల్లో కాపు ఓట్లను టిడిపి నుండి జారిపోకుండా తనదైన శైలిలో వ్యవహరించగల నాయకుడని చంద్రబాబు నమ్ముతున్న నేపధ్యంలో  2019 ఎన్నికలలో రాజధాని పరిసర ప్రాంతాలలో మరియు ప్రకాశం జిల్లాలలో ఉన్న కాపు ఓట్లను తెలుగుదేశం పార్టీ నుండి వేరే వైపు వెళ్లకుండా పార్టీలో ఎలక్షన్ల ముందు ఆమంచి కృష్ణమోహన్ కి చంద్రబాబు ఓ మంచి స్థానం ఇవ్వబోతున్నట్లు టాక్ వినపడుతోంది.   తద్వారా గోదావరి జిల్లాల్లో చంద్రబాబు కి గత ఎన్నికల్లో కొండంత బలంగా నిలబడిన కాపు నియోజికవర్గాలు ఈ సారి ఇబ్బంది పెట్టినా ప్రకాశం , గుంటూరు , కృష్ణా ప్రాంతం లో టీడీపీ కి గతం లో కంటే ఎక్కువ సీట్లు తేవడానికి ఆమంచి బెస్ట్ ఆప్షన్ అని బాబు ఫీల్ అవుతున్నారట. 


aamanchi-pawan-kalyan-ap-chandrababu-kapu-otubank
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
కొత్త స్పీకర్ పై పొగడ్తల వర్షం కురిపించిన కేసీఆర్..!
దేశంలో ఎక్కడా జరగని అభివృద్ధి ఏపీలో జరిగింది: చంద్రబాబు
ఏపీ విద్యారంగంలో సంచలన నిర్ణయం తీసుకున్న చంద్రబాబు..!
కుటుంబ సమేతంగా లండన్ పర్యటనకు బయలుదేరిన జగన్..!
సంచలనం సృష్టిస్తున్న జెసి బ్రదర్స్ బాబు భేటీ..!
చంద్రబాబు పై సంచలన వ్యాఖ్యలు చేసిన తలసాని శ్రీనివాస్ యాదవ్..!
చంద్రబాబు పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఏపీ బీజేపీ నేత..!
రైతులకు శుభవార్త తెలియజేసిన చంద్రబాబు..!
ఏపీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చూసి ఆశ్చర్యపోయిన మోడీ..!
2019 ఎన్నికల పోటీ విషయంలో క్లారిటీ ఇచ్చిన వైఎస్ విజయమ్మ..!
About the author

Kranthi is an independent writer and campaigner.