చంద్రబాబు రాజకీయ పతనాన్ని ఆ పార్టీ గట్టిగా కోరుకుంది. ఆ వైపుగా బాబు ను డ్రైవ్ చేస్తూ వచ్చింది. వ్యూహాత్మకంగా పావులు కదిపింది. అనుకున్నట్లుగానే బాబు ఆ ట్రాప్ లో చిక్కుకున్నారు. ఫార్టీ యియర్స్ ఇండస్ట్రీ కాస్తా కీలక సమయంలో జావగారారు. మొత్తానికి ఆ పార్టీ  అనుకున్నట్లుగానే బాబు చేశారు. ఇక ఫలితం కోసమే ఇపుడు ఆ పార్టీ ఆసక్తిగా ఎదురుచూస్తోంది.


వదిలించుకున్న బీజేపీ:


ఎండీయేలో ఇద్దరు నాయుళ్ళు మొదట్లో కీలకంగా ఉండేవారు. ఒక నాయుడు గారు బీజేపీ మనిషే. రెండవ వారు ఏపీకి చెందిన తెలుగుదేశం అధినాయకుడు. ఈ ఇద్దరిలో ఒకరు ప్రధాని, రెండవ వారు రాష్ట్రపతి అంటూ తమ్ముళ్ళు తరచూ అనేవారు. దానికి తోడు వారి హవా కూడా బాగా ఉండేది. దీంతో బీజేపీ పెద్దలకు ఎక్కడ లేని కంగారు పట్టుకుందని అంటారు. ఇద్దరూ కలసి ఉంటే ముప్పు అని భావించిన బీజేపీ వ్యూహకర్తలు ముందుగా వెంకయ్యనాయుడిని సైడ్ చేసేశారు. ఆయనను రాజ్యంగబద్దమైన పదవిల కూర్ఛోబెట్టారు .


ఇక మిగిలింది చంద్రబాబునాయుడు. వెంకయ్యనాయుడు వెళ్ళిపోయాక బీజేపీ నుంచి తగిన సహకారం లేకపోవడంతో తొందరలోనే చంద్రబాబు బయటపడిపోయారు. ఆ విధంగా ఆయన వెళ్ళిపోయేలా చేయడంలో కమలనాధులు తెర వెనక చేయాల్సినదంతా చేశారు. ఇక  ఏపీలో బాబు ఒంటరిగా ఉంటే సానుభూతి వస్తుందని ఆలొచించిన వారంతా ఆయన్ని కాంగ్రెస్ వైపుగా నడిపించాలనుకున్నారు.


రాహుల్ తో కరచాలనం:


ఏపీలో ఇప్పటికీ కాంగ్రెస్ కి చెడ్డ పేరు ఉంది. అవినీతి పార్టీగా కూడా ముద్ర ఉంది. దానికి తోడు విభజన పాపం ఎటూ ఉంది. ఆ పార్టీతో టీడీపీ చేతులు కలిపితే అస్థిత్వానికే ముప్పు అని బీజేపీకి తెలుసు. అందువల్ల బాబు ఆ వైపుగా జోరుగా నడిచేలా ప్రణాలికాబద్దంగా వ్యవరహించారని అంటారు. మొత్తానికి ఇపుడు బాబు కాంగ్రెస్ తో చేతులు కలపడం వల్ల యాంటీ కాంగ్రెస్ ముద్ర టీడీపీపై చెరిగిపోవడమే కాదు. 


ఆ ముద్ర చెదిరింది :


పార్టీ మూల సిధ్ధాంతానికే భంగం ఏర్పండింది. రేపటి ఎన్నికల్లో దీని ఫలితం ఏంటన్నది టీడీపీ చవి చూడబోతోంది.  దీంతో ఇక  అప్పటికీ ఎప్పటికీ కాంగ్రెస్ వ్యతిరేకత తమదేనని ఆ బ్రాండ్ ఇమేజ్ ని బీజేపీ సొంతం చేసుకోవడానికి కూడా ఈ విచిత్రమైన పొత్తు దోహదం చేసింది. మొత్తానికి చూసుకుంటే బాబు రాజకీయ చతురత అంతా బీజేపీ వేసిన ట్రాప్ లో  పడి ఎక్కడికిపోయిందోనని అంతా చర్చించుకునే పరిస్థితి వచ్చింది.


మరింత సమాచారం తెలుసుకోండి: