తెలుగుదేశం పార్టీ పెట్టిందే కాంగ్రెస్ కి వ్యతిరేకంగా, కాంగ్రెస్ తొ పొత్తు పెట్టుకుంటే జనం గుడ్డలూడసీసి కొడతారు. అంతటి పొరపాటు చంద్రబాబు చేస్తారని నేను అనుకోవడం లేదు. ఇకవేళ బాబు ఆ తప్పు చేస్తే దేముడు కూడా క్షమించడు. ఇదీ రెండు నెలల క్రిత్రం సీనియర్ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు చేసిన ఘాటు వ్యాఖ్యలు. అవి అప్పట్లో  స్రుష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు.


యూటర్న్ అయ్యన్న:


ఇంతలోనే ఎంత మార్పు. పార్టీలో ఫెయిర్ బ్రాండ్ ఇమేజ్ ఉన్న అయ్యన్నపాత్రుడు ఇలా నాలుక మడతేస్తారని ఎవరూ ఊహించలేదు. కాంగ్రెస్ టీడీపీ పొత్తు అనివార్యమని అయ్యన్న లేటెస్ట్ గా వ్యాఖ్యలు చేశారు. ఆగస్ట్ 23న ఇదే మీడియా ముందు అయ్యన్న చెప్పిన దానికి భిన్నంగా ఇపుడు కొత్త మాటలు మాట్లాడారు. దాంతో ఈ మాటలు అంటున్నది అయ్యన్నేనా అని షాక్ తినడం మీడియా వంతు అయింది. కాంగ్రెస్ తో పొత్తు దేశ రాజకీయాల్లొ అవసరమని  అయ్యన్న బాబుని సపోర్ట్ చేస్తూ మాట్లాడారు.


ఆత్మ గౌరవం కోసమేన‌ట:


కాంగ్రెస్ తో పొత్తు అన్నది ఆత్మ గౌరవం కోసమేనని అయ్యన్న భాష్యం చెబుతున్నారు. మోడీని ఎదిరించాలంటే ఈ పొత్తు తప్పదని కూడా ఆయన గట్టిగానే వాదిస్తున్నారు. మోడీ తెలుగువారిని అవమానించారని, అందువల్లనే తాము కాంగ్రెస్ తో చేతులు కలపాల్సి వచ్చిందని కూడా అంటున్నారు. అంటే తప్పు మోడీదే తప్ప తమది కాదని కూడా చెప్పకనే చెబుతున్నారు.


ఇదేనా రాజకీయం :


నాడు కాంగ్రెస్ ని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన టీడీపీ మంత్రులు ఇలా మడతేయడం వెనక రాజకీయం జనాలకు బాగానే అర్ధమవుతోంది. తమకు పార్టీలో ఇబ్బందులు ఉన్నపుడు ఏదో వంకతో అసంత్రుపి వ్యక్తం చేసి మీడియాకు ఎక్కడం, ఆ తరువాత అంతా సర్దుకున్నాక అబ్బే అప్పట్లో అలా అన్నాను కానీ ఇపుడు చెప్పిందే కరెక్ట్ అని చెప్పుకోవడం నాయకులకు అలవాటైపోయింది. ప్రస్తుతం అయ్యన్న అదే చేశారు. దీంతో ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు అన్న ముద్ర ఆయనపైన తొలగిపోయింది.


బాబే దిక్కు :


ఇక పోతే ఎన్నిక సీజన్ కూడా వస్తోంది. దాంతో టికెట్లు ఇచ్చే బాబుని ప్రసన్నం చేసుకోవడమే ఇపుడు నాయకులు, మంత్రుల పని. ఈ టైంలో బాబుని ఇబ్బంది పెడితే అసలుకే ఎసరు పెడతారు. దాని గ్రహించిన మీదటనే కాంగ్రెస్ తో పొత్తు వంటి కాలకూట విషాన్ని సైతం మింగేందుకు తమ్ముళ్ళు రెడీ అవుతున్నారు. ఏదేమైనా కీలెరిగి వాత పెట్టడం, సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోవడం బాబుకే చెల్లింది.


మరింత సమాచారం తెలుసుకోండి: