ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అన్నారు. కానీ అది రాజకీయ అవసరాలకు వాడుకునే ఆయుధం అని కూడా ఎన్నో సార్లు నిరూపితమైంది. హోదా కోసం అంటూ వైసీపీ ఎంపీలు రాజీనామా చేశారు. అదే హోదా కోసం టీడీపీ బీజేపీ నుంచి వేరు పడిపోయింది. ఇక అడ్డగోలు విభజన చేసిన కాంగ్రెస్ కూడా అప్పట్లో  హోదా మంత్రం జపించింది. ఇంతలా మలుప్లు తిరిగిన హోదా గొంతుక   ఈ మధ్యన చూస్తే  మాత్రం పెద్దగా వినిపించలేదు. అయితే ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ మరో మారు హోదా గొంతు విప్పుకోబోతోంది. మరి ఇది ఎవరి ప్రయోజనం కోసం 


హోదాపై అంతిమ పోరు :


ప్రత్యేక హోదాపై అంతిమ పోరు మొదలైందని సాధన సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాస్ అంటున్నారు. హోదాపై ఇది ఆఖరి పోరాటమని అంతా కలసి రావాలని కూడా పిలుపు ఇస్తున్నారు. ఈసారి ఆయన గొంతులో కొత్త శ్రుతులు పలుకుతున్నాయి.  హోదా కోసం ముఖ్యమంత్రి డిల్లీ వెళ్ళి రాష్ట్రపతిని కలుద్దామని చెప్పారట. అయితే అఖిలపక్షం రావాలని కోరినా ఎవరూ స్పందించలేదుట. ఇదీ శ్రీనివాస్ వాదన. అంటే బాబు సర్కార్ కి వకాల్తాగా ఈసారి హోదా ఉధ్యమం నడపబోతున్నారన్న సంకేతాలు అపుడే ఇచ్చేశారనంటున్నారు.


ఆరు నెలలుగా ఏం చేశారో :


హోదా అన్న మాట ఈ ఏడాది బడ్జెట్ సమావేశాల వరకే వినిపించింది. ఆ తరువాత ఎందుకో మూగబోయింది. అటు అధికార టీడీపీ, ఇటు ప్రతిపక్ష‌ వైసీపీ కూడా హోదా మాట ఎత్తలేదు. సరే అనుకుంటే హోదా సాధన సమితి పేరు మీద కూడ ఈ మధ్య కాలంలో పెద్దగా ఆందోళనలు  జరిగిందీ లేదు. మరి ఉన్న ఉదుటున చలసాని వారు ఇలా మీడియాకు వచ్చారంటే ఎన్నిక సీజన్లో మరో మారు హోదాను రగిలించి ఎవరికి ప్రయోజనం చేకూరుద్దామనో అన్న సెటైర్లు పడుతున్నాయి. అన్నట్లు ఇదే హోదా సాధన సమితిలో ఉన్న సినీ నటుడు శొంఠినేని శివాజీ ఇపుడు ఆపరేషన్ గరుడ అంటూ చంద్రబాబు పార్టీకి సానుభూతిపరుడిగా మారిన సంగతిని కూడా నెటిజన్లు కడిగిపారేస్తున్నారు.


ఆ పొత్తుకు ఆమోద ముద్ర :


కాంగ్రెస్ తో టీడీపీది అవవిత్రమైన పొత్తు. దీన్ని సమర్ధించుకోవాలంటే ప్రత్యేక హోదా ఒక్కటే మార్గం.  రాహుల్ ప్రధాని కాగానే తొలి సంతకం హోదా మీద పెడతారాని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. ఆ మాట ఇపుడు టీడీపీ పెద్దలు కూడా చెబుతున్నారు. మరి జనంలో చూస్తే హోదా ఊసే లేదాయే. దాన్ని రగిలిస్తే కానీ ఈ పొత్తుకు ఆమోదముద్ర పడదు.


కూటమి కోసమేనా :


అందువల్ల మళ్ళీ హోదా పోరు రేపటి నుంచి జనంలోకి వస్తుంది. అంతిమ పోరాటం అని కాదు. కాంగ్రెస్ టీడీపీ కూటమికి ఓటు వేస్తే హోదా తప్పకుండా వస్తుందని జనాల బుర్రల్లోకి ఎక్కించదానికి హోదా ని అడ్డంగా మరో మారు వాడేసుకుంటారన్న మాట. అవును 2014 ఎన్నికల్లో కూడా ఇదే హోదాను టీడీపీ మోడీని పెట్టుకుని వాడేసుకుంది. 


మరి అపుడు ఓటేసిన జనాలు ఇపుడు మళ్ళీ నమ్ముతారా. అంటే దగ్గరుండి మరీ నమ్మిస్తారు టీడీపీ సానుభూతిపరులన్నది తెర వెనక కసరత్తు చూస్తూంటే తెలిసిపోతోంది.  బాబు నాలుగేళ్ళ పాటు హోదా మరచిపోయినా, అడ్డంగా ఏపీని కాంగ్రెస్ విడగొట్టేసినా ఈ పొత్తును నమ్మి జనం నెత్తి మీద పెట్టుకోవాలి. చూడబోతుంటే దీని వెనకాల కూదా పెద్ద స్క్రిప్ట్ ఏదో ఉందని సోషల్ మీడియాలో కౌంటర్లు పడుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: