జగన్మోహన్ రెడ్డి పై హత్యాయత్నానికి సంబంధించి అందరిలో ఉన్న అనుమానాలే చివరకు నిజమవుతాయా ? అన్న అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే, హత్యాయత్నం చేసిన నిందితుడు శ్రీనివాస్ అక్క రత్నకుమారి స్వయంగా తమ్ముడి ప్రాణాలకు హాని ఉందని ఆందోళన వ్యక్తం చేయటమే నిదర్శనం. ఎవరిపైనా హత్యాయత్నం చేసేంత సీన్ తన తమ్ముడికి లేదని సోదరి చెబుతున్నారు. తన తమ్ముడికి ఎవరో డబ్బలు ఎరవేసి జగన్ పై హత్యాయత్నం చేయించుంటారనే ఆమె బలంగా నమ్ముతున్నారు. భూమి కొనేందుకు బేరం చేశాడనే ప్రచారంపైన, పది నెలల్లో తొమ్మిది మొబైల్ ఫోన్లను మార్చాడని సిట్ విచారణాధికారి మహేష్ చంద్ర లడ్డా చెప్పటంపైన కూడా అనుమానాలు వ్యక్తం చేశారు.

 

ఎప్పుడు ఊరికి వచ్చినా తన దగ్గరే 20 రూపాయలు తీసుకెళ్ళే వాడని చెప్పారు. తన తమ్ముడి దగ్గర బేసిక్ మొబైల్ ఫోన్ మాత్రమే ఉన్న విషయం తనకు బాగా తెలుసంటున్నారు. బండిలో పెట్రోలు పోసుకునేందుకు కూడా జేబులు డబ్బులు లేని తన తమ్ముడు నాలుగు ఎకరాలు ఎలా బేరం చేస్తాడని ఆమె సూటిగా ప్రశ్నించారు. సిమ్ కార్డ రీచార్జికే డబ్బులు లేనోడు ఏకంగా తొమ్మిది మొబైన్లు ఫోన్లు మార్చేంత డబ్బు ఎక్కడి నుండి వచ్చిందని రత్నకుమారి ప్రశ్నకు సమాధానం ఎవరు చెబుతారు ?

 

ఆమె అనుమానమేంటంటే డబ్బులు ఎరగా వేసి తన తమ్ముడిని హత్యాయత్నానికి పురమాయించుంటారట. తనతో హత్యాయత్నం చేయించిన వారి పేర్లను బయటపెడితే తన ప్రాణాలకు హాని ఉందని తమ్ముడు భయపడుతున్నారట. ఎవరి పేరు చెబితే ఏమవుతుందో అన్న ఆందోళనలో తన తమ్ముడున్నాడంటూ సోదరి భయపడుతున్నారంటే పరిస్ధితిని అర్ధం చేసుకోవచ్చు. మొత్తం మీద సిట్ విచారణ తీరు చూస్తున్న వారిలో ఎన్నో అనుమానాలు పెరిగిపోతున్నాయి.  అదే సమయంలో వైసిపి నేతలు కూడా నిందితుడి ప్రాణాలకు హాని జరుగుతుందన్న ఆందోళనలతో నిందితుడు సోదరి కూడా ఏకీభవించటం గమనార్హం.


మరింత సమాచారం తెలుసుకోండి: