మారుతున్న రాజకీయ పరిణామాల్లో ‘ ఎన్టీయార్ బయోపిక్ ‘ పై చర్చలు ఊపందుకుంటోంది. ఎన్టీయార్ బయోపిక్  అనగానే సినిమా ఎలా తీస్తారనే విషయం సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే, బయోపిక్ లో హీరో ఎవరు ? విలన్ ఎవరు ? ఏ ఏ సన్నివేశాలుంటయనే విషయంలో మామూలు జనాలకు స్పష్టమైన అవగాహనుంది. కాకపోతే హీరోను, విలన్ ను ఎలా చూపిస్తారనే విషయంలోనే బాగా చర్చ జరుగుతోంది. అందరికీ తెలిసిన విషయం ఏమిటంటే బయోపిక్ లో హీరో ఎన్టీయారే. మరి విలన్ ఎవరు ?

 

ఎవరంటే, బయోపిక్ లో ఇద్దరు విలన్లున్నారు. మొదటి విలనేమో కాంగ్రెస్ పార్టీ. రెండో విలనేమో నిజాయితీగా సినామా తీస్తే చంద్రబాబునాయుడే అనటంలో సందేహం లేదు. ఎన్టీయార్ తెలుగుదేశంపార్టీ పెట్టిందే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా అని మొదట్లోనే చెప్పారు కాబట్టి మొదటి విలన్ విషయంలో ఎవరికీ అనుమానం అవసరం లేదు. మరి రెండో విలన్ గురించి ? ఇక్కడే అందరిలోను టెన్షన్ మొదలైంది. 1994లో ఎన్టీయార్ ముఖ్యమంత్రి అవ్వగానే ఏడాదికే దించేసిన చంద్రబాబు విలన్ కాక మరేమవుతారు ?

 

ఎందుకంటే, తనకు  1984లో వెన్నుపోటు పొడిచిన మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావును చనిపోయే వరకూ ఎన్టీయార్ శతృవుగానే చూశారు. హీరోకి శతృవంటే విలనే కదా ? చంద్రబాబు విషయంలో కూడా ఎన్టీయార్ కు అదే అభిప్రాయముంది. కావాలంటే చనిపోయే ముందు చంద్రబాబు గురించి ఎన్టీయార్ ఇంటర్వ్యూలు చూస్తే ఆ విషయం స్పష్టంగా తెలుస్తుంది.  

 Related image

ఇక ప్రస్తుతానికి వస్తే బయోపిక్ తీస్తున్న నందమూరి బాలకృష్ణ స్వయంగా ఎన్టీయార్ కొడుకే కాదు, చంద్రబాబుకు బావమరిది కూడా. పైగా ఆయన పార్టీ తరపున హిందుపురం ఎంఎల్ఏగా కూడా ఉన్నారు. మళ్ళీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని ప్రయత్నిస్తున్నారు కూడా. ఇటువంటి సమయంలో తీస్తున్న బయోపిక్ లో బావగారు కమ్ ముఖ్యమంత్రి చంద్రబాబును బాలకృష్ణ విలన్ గా చూపించే సాహసం చేయగలరా ? చంద్రబాబు అనుమతిస్తారా ? అందుకనే బయోపిక్ లో విలన్ పాత్రపై ఎవరికీ ఆసక్తి లేదనే చెప్పాలి. మొత్తం సినిమా అంతా కాంగ్రెస్ నే విలన్ గా చూపిస్తారని అనుకున్నారు.

 

అయితే మారిన రాజకీయాల నేపధ్యంలో కాంగ్రెస్ ను కూడా విలన్ గా చూపించే అవకాశం లేదు. ఎందుకంటే, ఈమధ్యనే కాంగ్రెస్ తో చంద్రబాబు వియ్యమందుకున్నాడు కాబట్టి. ఈ పరిస్ధితుల్లో వియ్యంకుడిని కూడా విలన్ గా చూపటానికి చంద్రబాబు అంగీకరించే ప్రశక్తే లేదు. కాబట్టి బాలకృష్ణ తీస్తున్న బయోపిక్ లో విలన్ ఉండే అవకాశమే లేదు. చంద్రబాబు ఇమేజిని బూస్టప్ చేయటం కోసం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తీస్తున్నదనే విషయం అందరికీ తెలిసిందే.

 Image result for lakshmis ntr

అయితే అదే సమయంలో సంచలన దర్శకుడు రామ్ గోపాల వర్మ పెద్ద బాంబేశారు. ఎన్టీయార్ జీవితంలో జరిగిన కీలక ఘట్టాలతో తాను ఓ బయోపిక్ తీయబోతున్నట్లు ప్రకటించారు. దాంతో అందరిలోను వర్మ తీయబోతున్న ‘ లక్ష్మీస్ ఎన్టీయార్ ‘ సినిమాపై క్రేజ్ పెరిగింది. ఎన్టీయార్ కు నాదెండ్ల వెన్నుపోటు, చంద్రబాబు వెన్నుపోటు, వైస్రాయ్ హోటల్ ముందు ఎన్టీయార్ కు జరిగిన చెప్పుల సత్కారం, చివరకు మిస్టరీగా మిగిలిపోయిన మరణం లాంటివి ఉంటాయని వర్మ చెబుతున్నారు. నిజంగానే వర్మ గనుక అలా తీయగలిగితే లక్ష్మీస్ ఎన్టీయారే నిజమైన బయోపిక్ అని జనాలు అంగీకరించే అవకాశాలున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: