ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ పై హత్యాయత్నం చేసిన నిందితుడు శ్రీనివాస్ ఇపుడు విశాఖ జైల్లో ఉన్నాడు. అతన్ని బెయిల్ పై తీసుకురావడానికి ప్రయత్నాలు  జరుగుతున్నాయి. అదే కనుక జరిగి బెయిల్ మంజూరు  అయితే శ్రీనివాస్ బయటకు రావడం ఖాయం. మరి శ్రీనివాస్ బయటకు వస్తే నోరు తెరిస్తే అది సంచలనమే అవుతుంది. ఏపీలోని రెండు పెద్ద పార్టీలో ఒక పార్టీ ఆశల సౌధం కూలిపోయేలా శ్రీనివాస్ చెప్పే నిజాలు ఉంటాయని అంటున్నారు.


భయపడిపోతున్నాడు :


నిందితుడు శ్రీనివాస్ భయపడిపోతున్నాడని బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన లాయర్ సలీం  చెబుతున్నారు. ఈ రోజు మీడియాతో ఆయన మాట్లాడుతూ తాను శ్రీనివాసరావుని జైల్లో కలిసానని అంతను వణికిపోతున్నాడని చెప్పుకొచ్చారు. రాజకీయం కోసం తనను చంపేస్తారని కూడా అంటున్నారని తెలిపారు, మరి ఎవరు చంపుతారు ఎందుకు చంపుతారు అనది మాత్రం వెల్లడించలేదంటున్నారు. ఇక మరో మారు లాయర్ సలీం శ్రీనివాస్ ని ఈ రోజే కలవబోతున్నారు. అపుడు మరికొనీ విషయాలు చెబుతానని కూడా నిందితుడు చెప్పాడట.


ఆరోగ్యం బాలేదా :


శ్రీనివాస్ ఆరోగ్య పరిస్తితిపైన కూడా బెయిల్ పిటిషన్ వేస్తున్నట్లుగా లాయర్ చెప్పారు. అతను ఆరోగ్యంగా కనిపించలేదని కూడా అంటున్నారు. మరి శ్రీనివాస్ మానసికమైన వత్తిడితో అనారోగ్యం పాలు అయ్యాడా, లేక మరేదైనా కారణాలా అన్నది తెలియరావడంలేదు కానీ లాయర్ చెప్పిన మాటలు బట్టి చూస్తూంటే శ్రీనివాస్ ఆపదలో ఉన్నట్లు మాత్రం తెలుస్తోంది. అది హెల్త్  పాడై ఇబ్బందులు పడినా పడవచ్చు, లేదా ఎవరి నుంచైనా ప్రాణాపాయం ఉండొచ్చు మొత్తానికి శ్రీనివాస్ మాత్రం చాలా డేంజర్లో ఉన్నాడని అర్ధమవుతోంది.


అసలు నిజం వస్తుందా :


శ్రీనివాస్ బెయిల్ పిటిషన్ రేపు విచారణకు వస్తుంది. మరి సిట్ పోలీసులు బెయిల్ ఇవ్వకుండా  కౌటర్ వేయడం ఖాయం. తమకు నిందితుని నుంచి ఎటువంటి సమాచారం రానందున కస్టడీ కావాలని ఇప్పటికే పిటిషన్ వేశారు. అటువంటి వేళ బెయిల్ వస్తుందన్న దానిపై సందేహాలూ ఉన్నాయి. మరో వైపు జగన్ నుంచి వాంగ్మూలం కూడా తీసుకోలేదు. కేసుని ఎటూ తేల్చలేదు. ఈ టైంలో బెయిల్ రావడం కష్టమేనని కూడా అంటున్నారు. ఏది ఏమినా లాయర్ ద్వారా శ్రీనివాస్ గురుంచి విన్న మాటలు నిజమే అయితే పెద్ద కుట్ర ఈ కేసు వెనకాల ఉందని తెలిసిపోతోంది. మరి అసలు నిజం బయటకు వస్తుందా. శ్రీనివాస్ బయటకు వస్తాడా, వస్తే ప్రాణాపాయం లేకుండా ఉంటుందా అన్నది చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: