కేంద్రంలోని నిరంకుశ ప్రభుత్వంపై పోరాటం చేసేందుకే కాంగ్రెస్ పార్టీ సాయం కోరానని ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు చెప్పారు. శ్రికాకుళం జిల్లాను తిత్లీ తుపాను అల్లకల్లోం చేస్తే కేంద్రం ఒక్క పైసా కూడా సాయం చేయలేని ఆయన విమర్శించారు.  కేంద్రానికి మానవత్వం లేదని ఆయన నిందించారు. ఈ రోజు శ్రికాకుళం జిల్లాలో తిత్లీ తుపాను బాధితులాకు నష్టపరిహారం చెల్లించే కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు.


చూడకుండా పోయారు :


తిత్లీ తుపానుతో ఓ వైపు శ్రీకాకుళం జిల్లా ఇబ్బందులు పడుతుంటే గుంటూరు వచ్చిన కేంద్ర హోం మంత్రి రాజ్ నాధ్ సింగ్ కనీసం ఇటువైపు చూడకుండా పోయారని చంద్రబాబు విమర్శించారు. కనీసం ఆదుకునేందుకు కూడా కేంద్ర పెద్దలకు మనసు లేకుండా పోయిందని బాబు అన్నారు. అయినా  బాధ్యతగా రాష్ట్ర ప్రభుత్వం తన వంతు ప్రయత్నాన్ని పూర్తిగా చేసిందని, బాధితులకు న్యాయం జరిగేలా చూసిందని బాబు చెప్పారు. తితిలీ  తుపాను వల్ల ఒడిషా రాష్ట్రంలో ఎక్కువ ప్రాణ నష్టం జరిగిందని, అదే శ్రీకాకుళంలో పెద్దగా నష్టం లేకుండా తక్షణ చర్యలు తీసుకున్నామని బాబు చెప్పారు. 


బాధ్యత లేని పార్టీలు :


ఏపీలో బాధ్యత లేని ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయని చంద్రబాబు విమర్శించారు. వైసీపీ అధినాయకుడు జగన్   పక్క జిల్లాలో ఉన్నారని, ఆయన కనీసం పరామర్శకు రాలేదని చంద్రబాబు విమర్శించారు. పైగా ఆ పార్టీ నాయకులు సహాయ  పనులకు అంతరాయం కలిగేలా ఆందోళనలు నిర్వహించారని మండిపడ్డారు. తన దగ్గర వారి ఆటలు సాగవని బాబు  స్పష్టం చేశారు. కోడి కత్తి డ్రామాలు అడేందుకు సమయం ఉంటుంది కానీ బాధితులను పరామర్శించేందుకు ఉండదా అని బాబు ప్రశ్నించారు.


పవన్ మొసలి కన్నీరు :


ఇక పవన్ కళ్యాన్ మొసలి కన్నీరు కార్చడం తప్ప చేసిందేమిటని చంద్రబాబు ప్రశించారు. తిత్లీ బాధితులకు అండగా ఉంటూ సాయం కోసం కేంద్రాన్ని నిలదీయగలిగారా అని బాబు ప్రశించారు. పైగా మీటింగులు పెడుతూ పవన్ తనను నిందిస్తున్నారని చంద్రబాబు అన్నారు. ఈ పార్టీల పరిస్తితి అలా ఉందని ఆయన చెప్పుకొచ్చారు.


కేంద్ర వైఖరిని ఎండగడతా :


కేంద్రం ఏపీకి చేసిన అన్యాయాన్ని దేశమంతా తిరిగి ఎండగడతామని చంద్రబాబు చెప్పారు. దేశంలో సాగుతున్న వ్యతిరేక పాలనపైన కూడా జనంలోకి తీసుకుపోతామని బాబు పెర్కొన్నారు. ఇందుకోసం అన్ని పార్టీలను కలుపుకుని పోతామని చెప్పారు. ఏపీకి  ఎవరైనా చెడ్డ చేయాలని చూస్తే ఊరుకోమని, తగిన విధంగా గుణపాఠం చెబుతామని చంద్రబాబు హెచ్చరించారు. పండుగలు కంటే ప్రజల బాధల్లో పాలు పంచుకోవడమే తనకు ముఖ్యమని, అందుకే దసరా పండుగ ఇక్కడే జరుపుకున్నామని బాబు చెప్పారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: