జగన్ మీద జరిగిన దాడి గురించి టీడీపీ స్పందించిన తీరు సర్వత్రా వివాదాస్పదమైంది. కనీసం మానవత్వం కూడా లేకుండా జగన్ మీద కు ఎదురు దాడికి దిగారు. దీనితో టీడీపీ ప్రజల్లో ఉన్న పరువు ను పోగొట్టుకున్నది.  వైఎస్సార్సీపీ మీద 'కోడి కత్తి డ్రామా' అనే ముద్ర వేయించెయ్యాలన్నది చంద్రబాబు ఉబలాటం. ప్రతిపక్ష నేతపై హత్యాయత్నం జరిగితే కనీస సానుభూతి కూడా ప్రకటించని టీడీపీ నేతలు 'కోడి కత్తి డ్రామా' అంటూ రాజకీయం చేయడంలో మాత్రం అత్యుత్సాహం చూపుతున్నారు.


చంద్ర బాబు నెక్స్ట్ అదిరిపోయే ప్లాన్ ... కానీ ..!

'ఇదిగో, మేం కాంగ్రెస్‌తో కలవాలనుకుంటున్నది ఇలాంటి కుట్రపూరిత రాజకీయాల కారణంగానే..' అంటూ టీడీపీ నేతలు, తమ 'కోడి కత్తి డ్రామా'ని మరింత రక్తికట్టించేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా తునిలో రైలు తగలబడింది.. అది చంద్రబాబు 'రిజర్వేషన్ల హామీ' వైఫల్యంతోనేనన్నది ఓపెన్‌ సీక్రెట్‌. అప్పట్లో, ఆ రైలు తగలబెట్టింది వైసీపీయేనంటూ చంద్రబాబు సహా, టీడీపీ నేతలంతా మూకుమ్మడిగా 'ఎగిరెగిరిపడ్డారు'. చివరికి ఏమయ్యింది.? అసలు ఆ కేసు ఏమయ్యిందో ఎవరికీ తెలియని పరిస్థితి.

Image result for jagan attack

అధికారం చంద్రబాబు చేతుల్లో వుంది, ఆధారాలు వుండి వుంటే.. వైఎస్సార్సీపీని వదిలేసేవారా.? ఛాన్సేలేదు. ఇప్పుడీ 'కోడి కత్తి డ్రామా' విషయంలోనూ అంతే. మొత్తమ్మీద, 2019 ఎన్నికల్లో తనను గెలిపించేది ఈ 'కోడి కత్తి డ్రామా'యేనని చంద్రబాబు గట్టిగా నమ్ముతున్నారు. కానీ, ఆ కోడి కత్తి డ్రామానే, చంద్రబాబు కుట్రపూరిత రాజకీయాలకు 'ఎండ్‌ కార్డ్‌' వేస్తుందన్నది రాజకీయ విశ్లేషకుల వాదన.

మరింత సమాచారం తెలుసుకోండి: