Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Jan 17, 2019 | Last Updated 10:12 pm IST

Menu &Sections

Search

మాకు ప్రాణ హాని ఉంది : అమృత

మాకు ప్రాణ హాని ఉంది : అమృత
మాకు ప్రాణ హాని ఉంది : అమృత
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ఆ మద్య మిర్యాలగూడలో ప్రణయ్ పరువు హత్య ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.  ఇప్పుడు అతడి భార్య అమృత ప్రాణాలకు కూడా ముప్పు పొంచి ఉందా ? ఆమెను కూడా అంతమొదించేందుకు పథకం పన్నుతున్నారా ? అమృత నివసించే ఇంటి వద్ద రెక్కీ జరిగిందా ? నిజమేనంటోంది అమృత. తన ఇంట్లోకి ఓ గుర్తు తెలియని వ్యక్తి ప్రవేశించాడని, అది సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డయిందని పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆమె, ఆపై మాట్లాడుతూ, ఇద్దరు కానిస్టేబుళ్లు తమ ఇంటి పైగదిలో ఉంటూ గస్తీ నిర్వహిస్తున్నారని చెప్పిన ఆమె, వారు కిందకు వచ్చేలోపే ఆగంతకుడు గోడ దూకి పారిపోయాడని వెల్లడించింది.  

pranay-amrutha-father-maruthi-rao-maruthi-rao-in-e

మిర్యాలగూడలో కులాంతర వివాహం చేసుకున్న ప్రణయ్ నెలన్నర క్రితం దారుణ హత్యకు గురయ్యాడు.  భార్య అమృత, తల్లితో కలిసి వెళుతున్న అతడిని ఓ వ్యక్తి కత్తితో పొడిచి చంపాడు. ఈ హత్య రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ప్రణయ్ ను కిరాయి హంతకుడితో హత్య చేయించిన అమృత తండ్రి మారుతీరావు, ఆమె బాబాయ్ తో పాటు ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిపై పిడి యాక్ట్ నమోదు చేసి వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించారు. అయితే ప్రణయ్ తల్లిదండ్రులను బెదిరించి అమృతను తమ వైపు తిప్పుకోవాలని ఇంకా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారని..అమృత  ఆరోపిస్తుంది. 


pranay-amrutha-father-maruthi-rao-maruthi-rao-in-e

ఈ నేపథ్యంలో తమ ఇంటికి అగంతకుడు వచ్చాడని..ఇంట్లోకి వచ్చిన వ్యక్తి, ముఖద్వారానికి ఉన్న కర్టెన్ ను తొలగించి, లోపలికి చూశాడని చెప్పింది. ప్రణయ్ హత్య కేసులో నిందితులపై పీడీ చట్టం నమోదైన తరువాత ఈ ఘటన జరిగిందని, దీంతో తమకు చాలా భయంగా ఉందని చెప్పింది. ముఖానికి మాస్క్, నడుముకు నల్లని తాడు ధరించిన ఆ ఆగంతకుడు చాలా బలంగా కనిపించాడని అమృత వెల్లడించింది.

pranay-amrutha-father-maruthi-rao-maruthi-rao-in-e

ఇదే సమయంలో ప్రణయ్‌ తండ్రి బాలస్వామి మాట్లాడుతూ..తనను చంపి అమృతను తీసుకు వెళ్లాలని కుట్ర జరుగుతుందని..పోలీసులు తమకు రక్షణ కల్పించాలని అన్నారు. సీసీటీవీ ఫుటేజ్ ని పోలీసులకు అందించామని, తమ ఇంట్లోకి వచ్చిన వ్యక్తిని గుర్తించి, శిక్షించాలని పోలీసులను కోరుతున్నామని అన్నారు.


pranay-amrutha-father-maruthi-rao-maruthi-rao-in-e
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఎన్టీఆర్ మహానాయకుడు రిలీజ్ డేట్ మారింది!
ముద్దుగా పెంచుకుంటే..కృరంగా చంపేసింది!
బోనీకపూర్ కి ఆ దర్శకుడు కౌంటర్!
లక్కీ ఛాన్స్ కొట్టేసిన కీర్తి సురేష్!
చైతూ,సమంత ‘మజిలీ’సెకండ్ లుక్!
టీడీపీ నేత గెస్ట్ హౌస్ లో.. యువతులతో అశ్లీల నృత్యాల్లో రచ్చ!
రూ.150 కోట్ల క్లబ్ లో రజినీ 'పేట'!
కోరుకున్న ప్రియుడితో ప్రభాస్ హీరోయిన్ నిశ్చితార్థం!
ఆకట్టుకుంటున్న‘మణిక‌ర్ణిక ’వీడియో సాంగ్!
‘చిత్రలహరి’ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది!
‘సైరా’లో విజయ్ సేతుపతి ఫస్ట్ లుక్!
తన బుర్ర సెట్ అవుతుందని ఆశపడ్డా.. కానీ హర్ట్ అవుతారేమోనని వదిలేశా! : రాంగోపాల్ వర్మ
కియారా రెమ్యూనరేషన్ విని షాక్ తిన్నారట!
ఇంత దారణమైన ప్రచారాలా? హైదరాబాద్ సీపీని కలిసిన వైఎస్ షర్మిళ