చంద్ర బాబు ఏం మాట్లాడిన తన తందానా పాడటానికి ఒక మీడియా ఉంది కాబట్టి బాబు బతికి పోతున్నాడు . లేకపోతే బాబు పరిస్థితి మరోలా ఉండేది. అయితే చంద్ర బాబు కు పవన్ అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు. నిన్న శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు, తిత్లీ తుపాను గురించి మాట్లాడుతూ, పవన్‌కళ్యాణ్‌ ఉద్దానం పేరుతో ప్రచారం చేసుకుంటారనీ, ఉద్దానం ప్రజలకు తుపాను కారణంగా పెనునష్టం వాటిల్లితే, కనీసం కేంద్రానికి లేఖ కూడా రాయలేదని నిలదీసేశారు. దానికి, పవన్‌కళ్యాణ్‌ నుంచి ఘాటైన సమాధానమే వచ్చింది.

Image result for pavan janasena

'నిన్న మీరు, శ్రీకాకుళంలో నా మీద విమర్శలు చేశారు. కేంద్రాన్ని నేను ప్రశ్నించలేదన్నారు. ఇదిగో, కేంద్రానికి నేను రాసిన లేఖ..' అంటూ పవన్‌కళ్యాణ్‌, సోషల్‌ మీడియాలో ఓ లేఖను పోస్ట్‌ చేశారు. ప్రధాని నరేంద్రమోడీకి పవన్‌ రాసిన లేఖలో, తిత్లి తుపాను కారణంగా పెనునష్టం వాటిల్లిందని పవన్‌ పేర్కొన్నారు. తక్షణం రాష్ట్రానికి సాయం చేయాలని అందులో ప్రస్తావించారు పవన్‌. ఇదిలావుంటే, కేంద్రం తిత్లీ బాధితుల కోసమంటూ సుమారు 200 కోట్ల రూపాయల్ని రాష్ట్రానికి ప్రకటించిన విషయం విదితమే. పవన్‌, గవర్నర్‌కి ఫిర్యాదు చేయడం.. కేంద్రానికి లేఖ రాయడంతోనే ఈ సాయం వచ్చిందంటూ అప్పట్లో జనసేన 'డప్పు'కొట్టుకున్న మాట వాస్తవం. రాజకీయాల్లో ఇలాంటివన్నీ మామూలేననుకోండి.. అది వేరే విషయం.

Image result for chandrababu

మరోపక్క, పవన్‌కళ్యాణ్‌కి వ్యతిరేకంగా కృష్ణాజిల్లాలో ఫ్లెక్సీలు భారీయెత్తున దర్శనమిస్తున్నాయి. '2009 ఎన్నికల్లో మీ అన్నయ్యని గెలిపించుకోలేని నువ్వు, 2014 ఎన్నికల్లో చంద్రబాబుని గెలిపించేశానంటావా.?' అంటూ టీడీపీనేత ఒకరు భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం వివాదాస్పదంగా మారింది. మొత్తమ్మీద, 2014 ఎన్నికల్లో టీడీపీ - బీజేపీ - జనసేన కలిసి జనం ముందుకు వెళ్ళినా, ఇప్పుడు ఈ మూడు పార్టీలు ఒకదానికొకటి బద్ధశతృవులుగా మారిపోయాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: