ఆంధ్రప్రదేశ్  చరిత్ర చాలా భిన్నమైంది. ఎందరితోనో కలసి ఉంది. ఎన్నో అగచాట్లూ పడింది. నాడు చెన్నపట్నం నిర్మించి రాజధానిగా చేసుకుని తమిళ సోదరులను కూడా కలుపుకుని అంతా ఒక్కటే అని మురిసిపోయింది. అయితే అక్కడ మాత్రం వివక్ష తప్పలేదు. ఇంత చేసినా  ద్వితీయ శ్రేణి పౌరులుగా బతకడం నచ్చని ఆంధ్రులు ప్రత్యేక రాష్ట్రం కోరుతూ విడిపోయారు. ఆ తరువాత హైదరాబాద్ స్టేట్ తో కలసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఏర్పడి అరవయ్యేళ్ళు కలసి ఉన్నారు.



చివరకు అన్నదమ్ముల మధ్య ఏర్పడిన విభేదాల కారణంగా  అక్కడ నుంచి కూడా వేరు పడి నాలుగున్నరేళ్ళుగా నవ్యాంధ్రగా అభివ్రుద్ధి చెందుతూ ముందుకు సాగుతున్నారు. అందరితోనూ కలసిపోయే మనస్తత్వం కలిగిన ఆంధ్రులపై ఆ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. అది నిజమా


ఏపీకిలో కుల పిచ్చి ఉందట :


ఈ మాటలు అన్నది తెలంగాణా ఆపద్ధర్మ మంత్రి కే తారక రామారావు. ఈ రోజు మీడియాతో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఏపీకి కుల పిచ్చి ఉందని, తెలంగాణాలో అది లేదని చెప్పుకొచ్చారు. అందువల్ల ఎటువంటి చీలికలు కులపరంగా తీసుకువచ్చినా అది కుదిరే వ్యవహారం కాదని, తప్పక గెలిచి తీరుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మిగిలిన విషయాల మాటెలా ఉన్నా  ఏపీకి కుల పిచ్చి ఉందని కేటీయార్ అన్న మాట మాత్రం వాస్తవమా, లేక విమర్శ చేయాలని అంటున్నారా అన్నది విశ్లేషించాల్సిందే.


కులాభిమానం మెండు :


ఏపీ ప్రజలు ఓ విధంగా బాగా ఎమోట్ అయ్యే మనస్తత్వం కలిగిన వారుగా చెబుతారు. వారు అందరితోనూ కలసిపోతూ ఎక్కడికక్కడ మమతానురాగాలను పెంచేసుకుంటారు. అయితే అందులో వారు ఎక్కువగా చూసేది ప్రాంతం, భాష, కులం వంటి వాటిపైన మమకారంతోనే. మా ఏరియా వాడు అంటూ ఓ తీయని అనుబంధం కలుపుకుంటారు. అలాగే మా తెలుగు మాట్లాడేవారు అని కూడా భావిస్తారు. అలాగే మా కులం వాడని కూడా మురిసిపోతారు. అది అంతవరకే తప్ప కులం పిచ్చి మాత్రం కాదన్నది విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది.


రాజకీయం అలా చేసింది :


ఇక ఆంధ్రుల్లో ఇటువంటి భావోద్వేగాలు కారణంగానే చాలా సాధించారు. చాలా నష్టపోయారు కూడా. ముందే  చెపుకున్నట్లుగా రెండు రాజధానులను పోగొట్టుకోవడం వెనక ఈ భావోద్వేగంతో కూడిన అభిమానం కూడా ఓ  కారణం. ఇక కులం పైన అభిమానం వేరు, పిచ్చి వేరు. దానిని ఇక్కడ రాజకీయ నాయకులు వాడుకుని పిచ్చిగా మార్చుతున్నారు. అయితే ఇదంతా గతం. ఇపుడు కూడా చదువు లేని చోట, ఏమీ తెలియని వారు మాత్రమే కులం పట్ల పిచ్చితో రాజకీయ నాయకుల మాటలకు మోసపోతుంటారు.


 నిజంగా ఏపీలో కుల పిచ్చి ఉంటే అతి తక్కువ జనాభా కలిగిన రెండు ప్రధాన కులాలు దశాబ్దాల తరబడి రాజకీయం చేయలేవు. అధిక జనాభా ఉన్న కులాలు ఏనాడో అగ్ర పీఠం అందుకునేవి కూడా. ఏది ఏమైనా అభిమానం ఉండొచ్చు కానీ అది దురభిమానం కారాదు. కులాలు మతాలు కూడా రాజకీయ నాయకులు ఓట్ల కోసం చేస్తున్న గారడీ అని అర్ధం చేసుకోవడం ద్వారానే అడ్డుకట్ట వేయగలుతారంతా.


మరింత సమాచారం తెలుసుకోండి: