ఏపీ మంత్రి నారా లోకేష్ ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం ఆంధ్ర ప్రాంతంలో వచ్చిన తిత్లీ తుఫాను బాధిత ప్రాంతాలలో గతంలో పర్యటించిన సంగతి మనకందరికీ తెలిసినదే. తిత్లీ తుఫాను వాళ్ళ శ్రీకాకుళం జిల్లా వాసులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఈ క్రమంలో అధికారంలో ఉన్న టీడీపీ తుఫాను బాధిత ప్రాంతాలలో ఉన్న ప్రజలకు అన్నివిధాల అండగా ఉండు సహకారం అందిస్తూ ప్రభుత్వపరంగా చేయాల్సిన పనులు చేశారు.

Image result for nara lokesh

అయితే తుఫాను మిగిల్చిన నష్టం చాలా ఎక్కువ అయినా నేపద్యంలో తాజాగా నారా లోకేష్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తిత్లీ తుఫాను వల్ల నష్టపోయిన శ్రీకాకుళం జిల్లాలోని మందస మండలాన్ని ఆయన దత్తత తీసుకొని తన పెద్ద మనసు చాటుకున్నారు. మందస మండలంలోని 86 గ్రామాల తిత్లీ తుపాను బాధితులకు లోకేష్ 174 కోట్ల రూపాయల చెక్కులు అందజేశారు.

Related image

మొన్నటి దసరాను బాధితుల మధ్యే జరుపుకున్నానన్న లోకేశ్‌... దీపావళిని ఇక్కడే జరుపుకోనున్నట్లు తెలిపారు. తిత్లీ తుపాను బాధితులను తమ ప్రభుత్వం ఆదుకోవాలని చూస్తుంటే.. ప్రధాని మోడీకి దొంగపుత్రుడు, దత్తపుత్రులైన జగన్‌, పవన్‌లు డ్రామాలాడుతున్నారని లోకేష్ విమర్శించారు.

Image result for nara lokesh

విభజనతో నష్టపోయిన ఆంధ్ర రాష్ట్రాన్ని కష్టాల పాలు చేసిన కేంద్రాన్ని ఈ ఇద్దరు నేతలు ఎప్పుడు కూడా ప్రశ్నించలేదని..రాష్ట్రం కోసం కష్టపడుతున్న చంద్రబాబు ని మాత్రం అన్ని విధాల ఇబ్బందులపాలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని లోకేష్ పేర్కొన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా రాష్ట్రం కోసం ఎవరు కష్టపడుతున్నారో అన్ని విషయాలు ప్రజలకు తెలుసని 2019 ఎన్నికల్లో కచ్చితంగా ప్రజలు తమ ఓటు ద్వారా బుద్ధి చెబుతారని పేర్కొన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: