రాజకీయాల్లో లాజిక్కులకు  పెద్దగా అవకాశం లేకపోయినా జనాలను ఒప్పించేందుకు కొంతైనా తర్కం ఉండాలి. పైగా నడుస్తున్న చరిత్రను కూడా గమనంలోకి తీసుకోవాలి. అవేమీ లేకుండా జనాన్ని మభ్యపెట్టో, హిప్నటైజ్ చేసో తమ వాదనే  కరెక్ట్ అనిపించేసుకున్నా అసలు కధలో బోల్తా పడక తప్పదు.

యాంటీ ఇంకెంబెన్సీ :


దేశంలో ఇపుడున్న పరిస్తితులను చూస్తూంటే యాంటీ ఇంకెంబెన్సీ అన్ని చోట్లా కనిపిస్తోంది. అధికార పార్టీలకు వ్యతిరేకంగా ప్రజావాణి గొంతెత్తుతోంది. అది బ్యాలట్ రూపంలో కనిపిస్తోంది. కన్నడ నాట ఉప ఎన్నికలు తీసుకుంటే ఎంపీ సీట్లలో బీజేపీ పెద్ద తేడాలో ఓడిపోవడం బట్టి చూస్తే కేంద్ర  పాలకుల విధానాలపై జనాలకు మొహం మొత్తిందని అనిపిస్తోంది. ఇక రేపు జరగబోయే మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి పెద్ద రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వ వ్యతిరేకత గట్టిగానే ఉంటుందని అంటున్నారు.


తెలంగాణాలో ప్రభావం :


ఇక నాలుగున్నరేళ్ళు అధికారం చలాయించిన తెలంగాణాలో కూడా ప్రభుత్వ వ్యతిరేకత ఉండే అవకాశాలు దండిగానే ఉంటాయి. ప్రజా స్వామ్యంలో జనం మార్పు కోరుకునే అవకాశం ఓటు ద్వారా ఇస్తున్నపుడు ఆ దిశగానే ఆలొచనా ఎవరైనా చేస్తారు. అయితే దాన్ని ఎంత వరకు ఒడిసిపట్టి తమ సత్తా చూపిస్తారన్న దానిపైనే టీయారెస్ విజయం ఆధారపడిఉంది. మహా కూటమి జోరు అందుకోవడానికి ప్రభుత్వ వ్యతిరేకతే ఆలంబనగా చూడాలి.


ఏపీలోనూ అంతేనా :


ఏపీ విషయానికి వస్తే టీడీపీ అధికారంలో ఉంది. లెక్క ప్రకారం చూసుకుంటే యాంటి ఇంకెంబెన్సీ ఏపీని కూడా గట్టిగానే తాకాలి. అవినీతి, భూ కబ్జాలు, కుల పిచ్చి, వ్యవస్థలు సర్వత్రా  నిర్వీర్యం కావడం, పాలన పడకేయడం, అభివ్రుధ్ధి లేకపోవడం వంటివి చూసుకుంటే రేపటి ఎన్నికల్లో  ఇక్కడా బ్యాలెట్ వెక్కిరించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. మరి ఈ సంగతిని అధికార పార్టీ ఇక్కడ విస్మరించదమే పెద్ద జోక్.


ప్రతిపక్షాలకే చాన్స్ :


ఎక్కడైనా అధికారంలో ఉన్న పార్టీకి జనం చుక్కలు చూపిస్తారు. ఎన్నికలు వస్తున్నాయంటే గుండెల్లో గుబులు రేగేది పవర్లో ఉన్న వారికే, కేంద్రంలో మోడీ దిగిపోతారు, పక్కన కేసీయార్ ఓడిపోతారని తెగ హుషార్ చేస్తున్న తమ్ముళ్ళు ఇదే యాంటీ ఇంకెంబెన్సీ తమను కూడా ముంచేస్తుందని తెలుసుకోలేకపోతున్నారు.
 ఒక వేళ తెలిసినా మభ్యపెట్టాలనుకుంటున్నారు. ఇపుడున్న ట్రెండ్ ని బట్టి చూస్తే 2014లో గెలిచిన పాలక పార్టీలకు అంతటా రెడ్ సిగ్నల్స్ కనిపిస్తున్నాయి. మరి తమ్ముళ్ళు మళ్ళీ మేమే అన్న ఆర్భాటం మాని అసలు నిజాన్ని గురిస్తే మంచిదని సెటైర్లు పడుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: