చంద్ర బాబు 2019 లో ఓడి పోతాడని ఇప్పటికే జాతీయ సర్వేలు తేల్చి పారేశాయి. అంటే జగన్ 2019 లో సీఎం అవుతాడని అన్ని సర్వేలు ఘంటా పథంగా చెబుతున్నాయి. దీనితో చంద్ర బాబు కు ఎక్కడ లేని అభద్రతా భావం వచ్చింది. జగన్ గెలిస్తే టీడీపీ పరిస్థితి ఎలా ఉంటుందో బాబు కంటే బాగా ఇంకెవరికి తెలుసు. అందుకే భయం తో ఏదేదో మాట్లాడతున్నాడు.  కాంగ్రెస్‌ - జేడీఎస్‌ కూటమి అధికారంలోకి రాగానే, అక్కడికేదో తామే ఆ కూటమిని సెట్‌ చేసినట్లు చంద్రబాబు ప్రచారం చేసుకున్న సంగతి తెల్సిందే.

Image result for chandrababu naidu

బెంగళూరుకి వెళ్ళి రాహుల్‌గాంధీతో చంద్రబాబు కులాసా కబర్లు చెప్పిన వైనం ఎలా మర్చిపోగలం.? ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు బెంగళూరు వేదికగా రాజకీయం షురూ చేశారు. కేంద్రంలో, బీజేపీయేతర రాజకీయ పార్టీల్ని ఒక్కటి చేసే క్రమంలోనే జేడీఎస్‌ పెద్దలతో చంద్రబాబు మంతనాలు జరుపుతారట. పైకి చెప్పేమాట ఇదే అయినా, తెరవెనుకాల వ్యవహారం ఇంకోలా వుంది. జేడీఎస్‌ మద్దతుదారులైన కన్నడిగుల ఓట్లు, తెలంగాణ ఎన్నికల్లో తమకే పడేలా చంద్రబాబు, జేడీఎస్‌ పెద్దలతో మంతనాలు జరిపేందుకే ఢిల్లీకి పయనమయ్యారు.

Image result for chandrababu naidu

మరి, జేడీఎస్‌ - కేసీఆర్‌తో స్నేహం కాదనుకుని, చంద్రబాబుకి మద్దతిచ్చేలా వ్యవహరిస్తుందా.? అన్నది వేచి చూడాల్సిందే. ఒక్కటి మాత్రం నిజం.. చంద్రబాబు ఇటీవలి కాలంలో, పూర్తిస్థాయి అభద్రతాభావంతో వున్నారు. హైద్రాబాద్‌ తన కష్టార్జితమేనంటున్నారు.. కర్నాటకలో కాంగ్రెస్‌ - జేడీఎస్‌ గెలుపు తన గొప్పతనమేనంటున్నారు.. అభద్రతాభావం కారణంగా పుట్టుకొచ్చిన అసహనం చంద్రబాబుతో ఇలాంటి అర్థం పర్థంలేని మాటలు మాట్లాడిస్తోందన్నమాట.

మరింత సమాచారం తెలుసుకోండి: