టీడీపీ తెలంగాణ లో బలమైన పార్టీ ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో బలమైన ఓటు బ్యాంకు చంద్ర బాబు కు స్వంతం . ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే చంద్ర బాబు గట్టిగా సీట్లను అడగలేని పరిస్థితి దానికి కారణం లేకపోలేదు. ఇపుడు కనుక కాంగ్రెస్ తో కలిస్తే తన శక్తితో కాంగ్రెస్ను అధికారంలోకి తేవచ్చని కలలుకంటున్నారు చంద్రబాబు. దీనికోసం కాంగ్రెస్ చెప్పిన ప్రతిమాటకు ఊకొడుతున్నారు.


చంద్ర బాబు ఇన్ని భయాలకు కారణం ఒక్కటేనా...!

ఎందుకు బాబు ఇంత దిగజారుతున్నారు అంటే... రేప్పొద్దున జగన్ సీఎం అయితే కేంద్రంలో ఉన్న అధికార పార్టీ అండ లేకపోతే తనపై అవినీతి కేసులు నమోదవుతాయోమో అన్నది చంద్రబాబు భయం. ఈ కారణంగా కాంగ్రెస్ను బలోపేతం చేయడానికి తీవ్రంగా కృషిచేస్తున్నారు. ఇది చాలా మంది టీడీపీ శ్రేణులకు ఆంధ్రాలో నచ్చకపోయినా బాబుకు మాత్రం తప్పడం లేదు.మీరు అడిగింది చేస్తా - అడిగినంత ఇస్తా.... ఎలాగైనా మీరు తెలంగాణలోనూ - కేంద్రంలోనూ అధికారంలోకి రావాలి అని చంద్రబాబు రాహుల్ గాంధీని - సోనియాగాంధీని అడుగుతున్నారట.

Image result for jagan

ఈ క్రమంలో తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పెట్టిన ప్రతి రూలుకు చంద్రబాబు ఒప్పుకుంటారట. ఈ నియోజకవర్గాలు కావాలి అని కూడా బాబు అడగడం లేదట. పైగా జనాల్లో ఆదరణ లేని సీపీఐ - ఇటీవలే పుట్టిన కోదండరాం పార్టీ సీట్ల కోసం విపరీతంగా పట్టుపడుతుంటే  ఒకప్పుడు తెలంగాణలో అంత బలమైన పార్టీ... అయిన టీడీపీ కాంగ్రెస్ 14 సీట్లు ఇస్తే అదే ప్రసాదం అని తీసుకుందట. ఇంకా కావాలని డిమాండ్ కూడా చేయడం లేదు. తెలంగాణ టీడీపీ నేతలు 17 వరకు కోరుతున్నారు. ఇదే విషయాన్ని అధినేత చంద్రబాబుతో సమావేశమైన నేతలు అడిగారట. అయితే ఎక్కువ సీట్లలో పోటీ చేయడం మన లక్ష్యం కాదని - ఇచ్చిన సీట్లలో గెలవడం - టీఆర్ ఎస్ ను ఓడించడం లక్ష్యమని చంద్రబాబు వారికి చెప్పారట. ఇది తెలంగాణ టీడీపీకి శరాఘాతం.

మరింత సమాచారం తెలుసుకోండి: