దేశంలో అపుడే ఎన్నికల వాతావరణం మొదలైపోయింది. బీజేపీ కూడా అ దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. ఇక కాంగ్రెస్ ఎపుడో ముస్తాబై ఎన్నికలు అంటూ కలవరిస్తోంది. ప్రాంతీయ పార్టీలు కూడా ఎవరి మటుకు వారు బాగానే సర్దుకుంటున్నారు. ఇపుడు అందరి చూపూ సెమీ ఫైనల్స్ గా భావించే అయిదు రాస్ట్రాల ఎన్నికలపైన ఉంది. డిసెంబర్ చలికాలం, ఈసారి రాజకీయ జీవులకు మండు వేసవినే తెస్తోంది. ఎవరికి షాక్ ఇవ్వనుందో మరి.


కూటమి సంబరం తీరేనా :


కొత్త కూటమి కడతాం, బీజేపీకి వ్యతిరేకంగా అందరము కలుస్తామంటూ రంకెలు వేస్తున్న ప్రాంతీయ పార్టీలకు అయిదు రాష్ట్రాల ఫలితాలు చాలా  ముఖ్యం. ఇక్కడ మూడు చోట్ల బీజేపీ అధికారంలో ఉంది. అందువల్ల ఆ పార్టీని దెబ్బ తీయాలనుకోవడం సహజంగా కూటమి లక్ష్యం. అలాగే తెలంగాణాలో టీయారెస్ ని గద్దె దించాలనుకోవడం కూడా ప్రధానమైపోయింది. మరి ఆ ఆశలు నెరవేరే అవకాశాలు ఉన్నాయా అన్నదే  ఇక్కడ పాయింటు.


మూడు చొట్ల కూటమికి షాక్ :


లేటెస్ట్ గా ఇండియా టుడే సంస్థ ‘పొలిటికల్‌ స్టాక్‌ ఎక్సే్ఛంజ్‌’ పేరుతో సర్వే ఫలితాలను విడుదల చేసింది. సర్వే ఫలితాల ఆధారంగా పలు అంశాలను నిపుణుల సహాయంతో విశ్లేషించింది. ఆ వివరాలను బట్టి చూసుకుంటే మధ్యప్రదేశ్ లో తిరిగి బీజేపీ అధికారం చెపడుతుందట. ఆ పార్టీకి గతంతో పోలిస్తే సీట్లు తగ్గినా అధికారం గ్యారంటీ అంటోంది ఆ సర్వే. ఆలాగే చత్తీస్ గడ్ లోనూ మరో మారు బీజేపీ జెండా ఎగురుతుందంట. నాలుగవసారి రమణసింగ్ ముఖ్యమంత్రి అవుతారని సర్వే చెబుతోంది. రాజస్థాన్ లో మాత్రం కాంగ్రెస్ కి అవకాశాలు కనిపిస్తున్నాయి. మిజోరం చిన్న రాష్ట్రం అది పట్టింపు లేనిది.

మళ్ళీ కేసీయారే :


 
ఇక, తెలంగాణాలో చూసుకుంటే  డిసెంబర్  7న జరిగే ఎన్నికల్లో కే చంద్రశేఖర్‌రావు నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్‌) విజయం సాధించి, మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశాలు 75% ఉన్నాయని ఇండియా టుడే నిర్వహించిన తాజా సర్వేలో తేలింది. ఈ సర్వేలో మళ్లీ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే రావాలని 44% మంది కోరుకోగా, ప్రభుత్వం మారాలని 34% కోరుకున్నారు. మాకు తెలియదంటూ స్పందించిన వారు 22% ఉన్నారు. తదుపరి ముఖ్యమంత్రిగా కేసీఆర్‌కు 46%, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (కాంగ్రెస్‌)కి 25%, కిషన్‌రెడ్డి (బీజేపీ)కి 16%, ప్రొఫెసర్‌ కోదండరాంకు 7%, అసదుద్దీన్‌ ఒవైసీకి 4% మద్దతు పలికారు


 దీన్ని బట్టి చూసుకుంటే కూటమి అంటూ ఓ రేంజిల పొగిపోతున్న పార్టీలకు డిసెంబర్ దెబ్బ బాగానే పడనుందని అంటున్నారు. అయిదింట మూడు చోట్ల జెండా బీజేపీ, మిత్రులు ఎగరేస్తే అపుడు కూటమి కుంపటి చలి కాచుకోవడానికే తప్ప మరెందుకు కాదని సెటైర్లు పడుతున్నాయి. ఏది ఏమైనా మోడీ మానియాను చంద్రబాబు సహా కూటమి నేతలు తక్కువ అంచనా వేస్తున్నారేమో అనుకోవాల్సి వస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: