ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యానికే ప్రమాధం వచ్చిందంటున్నారు. అంటున్నది కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులుగా పనిచేసి రిటైర్ అయిన ఇద్దరు  మేధావులు అజయ్ కల్లం, ఐవైఆర్ కృష్ణారావు. జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో ఈరోజు జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారు 52 లక్షల భోగస్ ఓట్లున్నట్లు ఆందోళన వ్యక్తం చేశారు. వాళ్ళు చెప్పిన దానిప్రకారం మొత్తం ఓట్లలో 15 శాతం ఓట్లు భోగస్ వే. అంటే అంతా అధికార తెలుగుదేశంపార్టీ పుణ్యమే అని చెప్పక్కనే చెబుతున్నట్లైంది.

 

వీళ్ళు చెప్పిన దాని ప్రకారం వచ్చే ఎన్నికల్లో మళ్ళీ గెలవటానికి తెలుగుదేశంపార్టీ బ్రహ్మాండమైన వ్యూహమే రచించినట్లు స్పష్టమవుతోంది. ఇంతకీ ఆ వ్యూహమేమిటంటే ఒకటి వైసిపి పడుతుందని అనుకున్న ఓట్లను ఏరేయటం. ఇక రెండో వ్యూహం లక్షల సంఖ్యలో భోగస్ ఓట్లను చేర్చటం. విషయం ఏమిటంటే టిడిపి రెండు వ్యూహాలను ఏకకాలంలో దిగ్విజయంగా పూర్తి చేయటం. తమకు పడతాయని అనుకున్న ఓట్లను లక్షల సంఖ్యలో టిడిపి ఏరేసినట్లు వైసిపి నేతలు ఎప్పటి నుండో మొత్తుకుంటున్న విషయం అందరికీ తెలిసిందే. వైసిపి లెక్కల ప్రకారం సుమారు 40 లక్షల ఓట్లు జాబితాలో నుండి గల్లంతయ్యాయట. ఓటర్ల జాబితాలోగల్లంతైన వాళ్ళంతా పోయిన ఎన్నికల్లో ఓట్లేసిన వాళ్ళే.

 

ఇక భోగస్ ఓట్ల విషయం చూస్తే తాజాగా బయటపడిన లెక్కల్లో ప్రతీ నియోజకవర్గంలో వేల సంఖ్యలో భోగస్ ఓట్లు చేర్చినట్లు స్పష్టమవుతోంది. కుప్పం నియోజకవర్గంలోని సుమారు 27 వేల భోగస్ ఓట్లను జనచైతన్య వేదిక గుర్తించింది. భోగస్, నకిలీ ఓట్లంటే అనేక విధాలుగా ఉన్నాయి. ఓకే వయసుతో రెండు చోట్ల ఓటుహక్కున్న వ్యక్తులు సుమారు 25 వేలమందుతున్నారట. ఒకే వ్యక్తి రెండు గుర్తింపు కార్డులతో రెండు చోట్ల ఓట్లున్నవారు సుమారు 37 వేల మందున్నారు.


ఒక చోట తండ్రి పేరు మరో చోట భర్త పేరుతో ఓట్లున్న మహిళల సంఖ్య 93 వేలట. అధికార పార్టీతో అధికారులు కుమ్మక్కవ్వటం వల్లే ఇటువంటివి సాధ్యమవుతాయని మేధావులు చెప్పటం గమనార్హం. ఈ పద్దతిలో లక్షల సంఖ్యలో భోగస్ ఓట్లు చేర్పించవచ్చని తాను ఇప్పటికి వరకూ ఊహించలేదని కల్లం చెప్పటం గమనార్హం.


ఇవన్నీ పక్కనపెడితే అటు తెలంగాణాలో అటు ఏపిలో ఓట్లున్న వారి సంఖ్య సుమారు 18 లక్షలున్నట్లు చెప్పారు. కల్లం చెప్పిన ప్రకారమైతే సగటున ప్రతీ నియోజకవర్గంలో 30 వేల ఓట్లుండొచ్చని బయటపడింది. మొత్తం 4 కోట్ల ఓటర్లలో సుమారు 52 లక్షలు భోగస్ ఓట్లే ఉన్నాయంటే ఎన్నికలు జరపటంలో అర్ధమే లేదని అజయ్ కల్లం చెప్పటం నిజమే అనిపిస్తోంది.

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: