వైసీపీ అధినేత జగన్ పై ఇటీవల విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన హత్యా యత్నం రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు జగన్ కావాలనే తనపై తాను హత్యాయత్నం చేయించుకొని సానుభూతి రాజకీయాలకు తెరలేపారని అర్థం పర్థం లేని ఆరోపణలు చేసి రాష్ట్ర రాజకీయ నేతల్లో ఛి అనిపించుకున్నారు. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న ప్రధాన రాజకీయ పార్టీ నేతలు టీడీపీ చేసిన ఆరోపణలపై విమర్శలు కూడా చేశారు. ఇదిలా ఉండగా తనపై జరిగిన హత్యాయత్నం విషయంలో విశాఖపట్టణం విమానాశ్రయంలో మరియు ఆంధ్రాలో ఏటువంటి అల్లర్లు  జరగకుండా జగన్ తనకు తానుగా విశాఖపట్టణం లో ప్రాథమిక చికిత్స చేయించుకొని...హైదరాబాద్ వెళ్లిపోవడంతో...రాష్ట్రంలో ఎటువంటి అల్లర్లు జరగకుండా ఒక హోంద కలిగిన రాజకీయవేత్తగా...వైసీపీ పార్టీ అధ్యక్షుడిగా రాజశేఖర్ రెడ్డి కొడుకు అనిపించుకున్నారని చాలా మంది సీనియర్ రాజకీయ నేతలు పేర్కొనడం విశేషం.


ఈ క్రమంలో తన భర్త రాజశేఖర్ రెడ్డి ని పోగొట్టుకున్న విజయమ్మ..తన కొడుకు పై జరిగిన హత్యాయత్నం విషయంలో ఇప్పటివరకు మీడియా ముందు ఎక్కడా కూడా మాట్లాడలేదు. అయితే తాజాగా నవంబర్ 11 వ తారీకున జగన్ మళ్లీ పాదయాత్ర మొదలుపెడుతున్నా నేపద్యంలో..విజయమ్మ మీడియా సమావేశం పెడుతున్నారు. ఈ క్రమంలో గతంలో జగన్ కాంగ్రెస్ పార్టీని వీడి తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి మరణాన్ని తట్టుకోలేక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చనిపోయిన ప్రతి కుటుంబాన్ని పలకరించడానికి బయలుదేరక ముందు...నా భర్తను పోగొట్టుకున్న నేను నా బిడ్డ జగన్ ని మీ చేతుల్లో పెడుతున్నానని...తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి మాదిరే జగన్ వ్యక్తిత్వం ఉంటుందని..ఎక్కడ కూడా ఇచ్చిన మాటను తప్పి పోవడం తనకు చిన్నప్పటి నుండి చేతకాదని చెప్పడం జరిగింది.


ఈ క్రమంలో మొట్టమొదటి సారి ప్రజా సంకల్ప పాదయాత్రలో జగన్ పై హత్యాయత్నం జరిగిన చానాళ్ల తర్వాత విజయమ్మ మీడియా ముందుకు రావడంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ నాయకులు కూడా విజయమ్మ ఎటువంటి స్పీడ్ ఇస్తుందోనని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.


ఇదే క్రమంలో ఏపీ లో ఉన్న వైసీపీ కార్యకర్తలు పాదయాత్ర చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో జగన్ కి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడంలో మునిగిపోయారు. మొత్తమ్మీద జగన్ తలపెట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలను ముఖ్యంగా చంద్రబాబుని ఉక్కిరి బిక్కిరి చేసింది అని అనటంలో ఎటువంటి సందేహం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: