ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశాక కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో క్రియాశీలకంగా రాజకీయాల్లో వ్యవహరించిన చిరంజీవి తర్వాత జరిగిన కొన్ని రాజకీయ పరిణామాల వల్ల మెల్లమెల్లగా రాజకీయ రంగానికి దూరం అయి..తిరిగి  సినిమాలు చేయడం మొదలుపెట్టారు.

Related image

అయితే గత కొన్నాళ్ల నుండి చిరంజీవి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న నేపథ్యంలో..తాజాగా మరో వార్త చిరంజీవి పొలిటికల్ కెరియర్ పై హల్ చల్ చేస్తోంది. విషయమేమిటంటే ఇటీవల కాంగ్రెస్ పార్టీతో తెలుగుదేశం పార్టీ చేతులు కలపడంతో చిరంజీవికి నచ్చకపోవడంతో..కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తన తమ్ముడు జనసేన పార్టీ కి రాజకీయ సలహాలు ఇవ్వడానికి రెడీ అయినట్లు సమాచారం.

Image result for chiru pawan kalyan

ప్రస్తుతం తెలుగుదేశం పార్టీతో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకోవడంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న ఈ క్రమంలో..మొదటి నుండి కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న చాలా మంది సీనియర్ రాజకీయ నాయకులు ఒక్కొక్కరి వీటి వల్ల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఇతర పార్టీలలో జాయిన్ అవుతున్న విషయం మనకందరికీ తెలిసినదే.

Image result for chiru pawan kalyan

ఈ క్రమంలో చిరంజీవి కూడా సీనియర్ కాంగ్రెస్ నేతలు పట్టిన బాటలోనే పయనించి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తన తమ్ముడు స్థాపించిన జనసేన పార్టీకి రాజకీయ సలహాలు ఇచ్చే పనిలో ఉండటానికి సుముఖంగా ఉన్నట్లు సమాచారం. అయితే చిరంజీవి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్న విషయమై ఇప్పటి వరకు అధికారికంగా బయట ఎక్కడ ప్రకటన లేదు. అయితే మరోపక్క 2019 ఎన్నికల ముందే చిరంజీవి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తన తమ్ముడికి అంతగా రాజకీయాలలో ఉండాలని భావిస్తున్నట్లు సమాచారం.



మరింత సమాచారం తెలుసుకోండి: