చంద్రబాబు ఎన్నికల టీం తయారుచేసుకున్నారు. ఓట్లు దండీగా వచ్చే వర్గాలకు పెద్ద పీట వేస్తున్నట్లుగా కలరింగు ఇచ్చే ప్రయత్నం చేశారు. ప్రతిపక్ష వైసీపీకి అండగా ఉంటూ వస్తున్న మైనారిటీలు, గిరిజనులు ఆ పార్టీకి ఇపుడు గుర్తుకువచ్చారు. అందుకే  ఆదరాబాదరాగా ఆ రెండు వర్గాల నుంచి ఇద్దరిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. బాబు కొలువులో కొత్త మంత్రులుగా  ఎస్ ఎం డీ ఫరూక్,  కిడారి శ్రావణ్ కుమార్ ఈ రోజు ప్రమాణం చేశారు.


అర్నేళ్ళ ముచ్చట కోసం :


నిజానికి చంద్రబాబుకు మైనారిటీలు, గిరిజనులపై కనుక మమకారం ఉంటే అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లొనే ఈ రెండు వర్గాల నుంచి మంత్రులను తీసుకునేవారని సెటైర్లు పడుతున్నాయి. ఎన్నికలు దగ్గర పెట్టుకుని మంత్రులుగా ఇద్దరికీ అవకాశం ఇచ్చానని చెప్పుకోవడం ద్వారా బాబు ఓట్ల వేటకు తెర తీశారని అంటున్నారు. తీరా చూస్తే ఈ ఇద్దరు మంత్రులది ఆరు నెలల ముచ్చటగానే మిగిలిపోతుందని అంటున్నారు. 


ప్రజలు గెలిపించిన వారు కారు :


చిత్రమేమిటంటే ఈ ఇద్దరు మంత్రులు కూడా జనం గెలిపించిన వారు కారు. గత మూడు ఎన్నికల్లో జనం తిరస్కారానికి గురై 2017 నంద్యాల  ఉప ఎన్నికల సందర్భంగా బాబు అక్కర మేరకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ నుంచి మండలి చైర్మన్ అయిన వారు ఫరూక్. ఇక కిడారి  శ్రావణ్ కుమార్ అయితే రాజకీయాలకు పూర్తిగా కొత్త. ఆయన తండ్రి 2014లో వైసీపీ టికెట్ మీద గెలిచి టీడీపీలోకి జంప్ అయ్యారు. రెండు నెలల క్రితం మావోయిస్టుల దాడిలో ప్రాణాలను కోల్పోయిన కిడారి కుటుంబం నుంచి శ్రావణ్ ని మంత్రిని చేయడం ద్వారా సానుభూతిని సంపాదించాలన్నది టీడీపీ ఎత్తుగడగా కనిపిస్తోంది. 


ఇక ఆరు నెలల్లో ఎటూ ఎన్నికలు  ఎటూ ఎన్నికలు జరగ‌వు, మరి రెండు చట్ట  సభల్లో శ్రావణ్ సభ్యుడు కాదు. ఈలోగా అసలు ఎన్నికలే వస్తాయి. అందువల్ల శ్రావణ్ ని తీసుకుని గిరిజనులకు, ఆ కుటుంబానికి ఏదో చేసినట్లుగా చెప్పాలన్నది బాబు ప్యయత్నం.  మొత్తానికి చూసుకుంటే 2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున 102 మంది ఎమ్మెల్యేలు జనం ఓట్లతో గెలిస్తే బాబు మాత్రం వారిని పక్కన పెట్టి ఈ ఇద్దరినీ మంత్రులుగా తీసుకోవడం తనదైన మార్క్ పాలిట్రిక్స్ ని చెప్పకనే చెబుతోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: