పవన్ కళ్యాణ్ తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని తేల్చేసింది. అయితే ఎందుకు ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రశ్నిస్తే పవన్ చెప్పే సమాధానం వింటే ఇది అబద్దమని ఎవరికైనా అర్ధం అవుతుంది. అక్కడ ముందస్తు ఎన్నికలు రావడం వల్లే తాను పోటీకి దిగాలా వద్దా అని ఆలోచిస్తున్నానని అంటున్నారు జనసేనాని. నాయకుడనేవాడు ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలి, ప్రత్యర్థి పార్టీల ఎత్తులకు పైఎత్తులు వేసే సత్తా ఉండాలి, నమ్ముకున్న వారిని ముందుకి నడిపించే తెగింపు ఉండాలి. కానీ పవన్ కల్యాణ్ అదోటైపు. ఎప్పుడు ఎటు దూకుతారో తెలీదు. అందుకే ఆయన తెలంగాణ ఎన్నికలపై ఇంకా తేల్చుకోలేని స్థితిలో ఉన్నారు.


చూస్తుంటే పవన్ కళ్యాణ్ ను వాళ్ళే ముంచేటట్లున్నారే ...!

సాధారణ ఎన్నికల టైమ్ కే తెలంగాణలో కూడా ఎన్నికలు జరిగితే 23 అసెంబ్లీ, 3 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోటీ చేయాలని పవన్ ఆశ. మీడియా సమావేశంలో కూడా ఇదేమాట బైటపెట్టారు పవన్. ముందస్తు రావడం వల్లే తాను సిద్ధంగా లేనని అంటున్నారు. అయితే పవన్ చెప్పేదంతా అవాస్తవం అని జనసైనికులతో సహా జనాలందరికీ తెలుసు. పొత్తుల విషయంలో తెలంగాణ సీపీఎం నేతలు ఎంతో ఆశగా జనసేన కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరిగారు. చివరకు వారి ఆశలపై నీళ్లు చల్లిన పవన్, తనతో పాటు వారిని కూడా తెలంగాణ ఎన్నికల్లో ఎటూ కాకుండా చేశారు. పవన్ అనే ఆశ లేకపోతే కనీసం మహాకూటమలో చేరి నాలుగైదు సీట్లు దక్కించుకునేది సీపీఎం. ఇప్పుడా అవకాశం కూడా లేదు.

దొంగలు పడ్డ 6 నెలలకు రియాక్ట్ అయిన పవన్

ఇక పవన్ విషయానికొస్తే.. పవన్ ది అంతా మేకపోతు గాంభీర్యం అని తేటతెల్లమైపోతోంది. తెలంగాణలో కేసీఆర్ ముందస్తు మేళం పెట్టబోతున్నారనేది జగమెరిగిన సత్యం. అందరికీ తెలిసిన విషయం పవన్ ఒక్కడికీ తెలియకుండా పోతుందా. ఇక రోజూ కాంగ్రెస్, టీడీపీ అపవిత్ర పొత్తుపై మండిపడే పవన్ కు కనీసం అప్పుడైనా తెలంగాణలో ఎన్నికల టైమ్ వచ్చిందనే విషయం గుర్తుకు రాలేదేమో.

మరింత సమాచారం తెలుసుకోండి: