రాజకీయాల్లో ఎవరైనా గెలిచొస్తే పదవులు కట్టబెడతారు. సత్తా చాటుకుంటే అవకాశాలు ఇస్తారు. కానీ ఏకంగా ప్రాణాలను తీసుకుంటేనే తప్ప అక్కడ పదవుల పందేరం జరగదా...అప్పటికి కానీ న్యాయం చేయలేరా ఇవీ ఇపుడు అటు పార్టీలోనూ, ఇటు జనంలోనూ మరో మారు చర్చకు వస్తున్న అంశాలు.


అపుడలా 


కర్నూలు జిల్లాకు చెందిన కీలక నాయకుడు, దశాబ్దాల తరబడి రాజకీయాలను శాసించిన భూమా నాగిరెడ్డికి మంత్రి కావాలని బలంగా కోరిక ఉండేది. రాజకీయాల్లో ఏళ్ళకు ఏళ్ళు ఉన్నా మంత్రి కాలేదే అన్న చింతతోనే ఆయన వైసీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. తనతో పాటు తన కుమార్తెను, ఇతర ఎమ్మెల్యేలను కూడా ఆయన కూడగట్టారు.


అయితే ఆయన పార్టీలో చేరి ఏడాది గడచినా చంద్రబాబు ఇచ్చిన హామీ నిలబెట్టుకోకపోవడంతో ఆ దిగులుతోనే ఆయన గుండెపోటుతో మరణించారని అంటారు. ఆ తరువాత ఆయన కుమార్తె అఖిలప్రియను బాబు మంత్రిని చేసి రుణం ఆ విధంగా తీర్చుకున్నారు.


ఇపుడు కూడా ఇలా :


ఇక కట్ చేస్తే ఇలాంటిదే మరో సీన్ కనిపిస్తుంది. మంత్రి కావాలని బలీయమైన కోరికతో విశాఖ జిల్లా అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు 2016 ఆగస్ట్ లో వైసీపీని వీడి టీడీపీలో చేరారు. ఆయనకు కూడా మంత్రి పదవి ఆశ చూపారని అంటారు. కానీ చివరకు ప్రభుత్వ విప్ పదవి తో సరిపెట్టారు. దాంతో సర్వేశ్వరరరావు చాలా బాధ పడేవారని చెబుతారు. ఎలాగైనా మంత్రి కావాలన్న కోరికతో ఆయన వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే ఏపాట్లు చేస్తుకుంటూ మారు మూల ప్రాంతాలను సైతం తిరుగుతూ  పట్టు కోసం  రాజకీయం చేస్తూ వచ్చారు. 


ఆ ఫలితంగా మావోలకు చిక్కి ఏకంగా ప్రాణాలనే కోల్పోయారు. ఆయన అలా మరణించగానే ఇలా అయన కుమారుడు కిడారి శ్రావణ్ కుమార్ ని మంత్రిని చేశారు చంద్రబాబు. అదే కిడారికే ఆ పదవి ఇస్తే ఇలా దారుణంగా హత్యకు గురి అయ్యేవాడు కాదు కదా అని అంతా అంటున్నారు. మొత్తానికి టీడీపీలో బాబు మార్క్ సరికొత్త సంప్రదాయం ప్రవేశపెట్టారని, బతికుండి పార్టీకి ఎంత సేవ చేసినా దక్కని మంత్రి పదవులు వారు చనిపోయాక వారసులకు సునాయాసంగా దక్కుతున్నాయని అంటున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: