పవన్ కళ్యాణ్ నీతులు చెప్పడం లో ముందుంటాడు కానీ విచిత్రం ఏంటంటే ఆ నీతులు పవన్ కు వర్తించవు. సంస్కారం గురించి మాట్లాడతాడు కానీ సంస్కార హీనంగా మాట్లాడతాడు. తను ఎవరిని ఏమీ అనను అని.. అందరితోనూ చాలా సంస్కార పూరితంగా ప్రవర్తిస్తానని.. పవన్ చెబుతూ ఉంటాడు. రాజకీయాల్లో విమర్శలు మామూలేనని..అలాగని తను కుసంస్కారపూరితమైన మాటలు మాట్లాడను అని పీకే సెలవిస్తూ ఉంటాడు.


జగన్ మగతనం మీద పవన్ సంచలన వ్యాఖ్యలు...!

అలా సంస్కారం గురించి చాలా సంస్కారపూరితంగా లెక్చర్లు ఇచ్చే సంస్కారవంతుడు పవన్ కల్యాణ్.. మరోసారి తన సంస్కారం గురించి చాలా సంస్కారవంతంగా చాటి చెప్పుకున్నాడు. ఈసారి జగన్ ‘మగతనం” గురించి పవన్ ప్రశ్నించాడు. జగన్ తన ‘మగతనాన్ని” నిరూపించుకోవాలని పవన్ సవాల్ విసిరాడు. సందర్భం ఏదైనా.. ఏ విషయంలో ఈ సవాల్ విసిరినా.. పవన్ కల్యాణ్ తన సంస్కారాన్ని ఇలా చాటుకున్నాడు.


జగన్ మగతనం మీద పవన్ సంచలన వ్యాఖ్యలు...!

ఇందుమూలంగా యావన్మందీ అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే.. పవన్ కల్యాణ్ సంస్కారం ఇది. తను చాలా సంస్కార వంతుడిని అని.. తన తల్లి తనకు సంస్కారం నేర్పిందని కూడా ఇదే సమయంలో పవన్ కల్యాణ్ సెలవివ్వవడం కొసమెరుపు. ఇదేనన్నమాట అది! ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ ఆవేశంతో జగన్‌పై చేసిన మగతనం కామెంట్స్ సోషల్ మీడియాలో పవన్ వర్సెస్ జగన్‌గా మారాయి. నిన్న మొన్నటి వరకూ చంద్రబాబు పార్టీకి అండగా ఉండి ఆ పార్టీని అందలం ఎక్కించిన పవన్ కళ్యాణ్ రాష్ట్ర అవినీతిలో భాగమే అంటున్నారు వైసీపీ నేతలు. జగన్ సింగిల్‌గానే చంద్రబాబుని ఢీకొన్నారని.. చంద్రబాబు, పవన్‌లు కలిసినా జగన్‌కి 67 సీట్లు వచ్చాయన్నారు. అదీ జగన్‌కి ఉన్న మగతనం. దమ్ముంటే పవన్ కళ్యాణ్ ఇందులో సగం సీట్లు గెలుచుకుంటే ఎవరి సత్తా ఏంటో తెలుస్తుందని సవాల్ విసురుతున్నారు వైసీపీ శ్రేణులు.

మరింత సమాచారం తెలుసుకోండి: