ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మునుపెన్నడూ లేని సరి కొత్త సమీకరణలు, కాంబినేషన్లను  చూడబోతున్నాయి. గతంలో ఉప్పూ నిప్పులా ఉన్న కాంగ్రెస్, టీడీపీ చెట్టాపట్టాలు వేసుకున్న తరువాత జనం షాక్ తిన్నారు. దాని కంటే మరీ షాక్ లాంటి  న్యూస్ తొందరలోనే ఏపీ జనం వినే అవకాశాలు  కనిపిస్తున్నాయి. అన్నీ కుదిరితే సాధ్యమైనంత తొందరలోనే ఆ కాంబో  రివీల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.


పవన్తో జట్టు :


ఏపీలో బీజేపీ సరికొత్త ప్రయోగం చేయబోతోంది. జనసేనాని తో జట్టు కట్టి ఎన్నికల గోదారిని ఈదాలనుకుంటోంది. పవన్ తో కలవడం వల్ల గ్లామర్ పరంగా లోటు లేదు. జనాలు వెల్లువల తరలివస్తారు. ఆయన పార్టీకి క్లీన్ ఇమేజ్ ఉంది. వ్యక్తిగతంగా కూడా పవన్ మీద పెద్దగా మచ్చలు, అన్నింటికంటే ముఖ్యంగా అవినీతి ఆరోపణలు అసలు లేవు. అందువల్ల పవన్ ని ముందుంచుకుని తన అనుభవాన్ని జోడిస్తే ఏపీలో మ్యాజిక్ చేయవచ్చునని కనలానాధులు పక్కాగా ప్లాన్ వేస్తున్నారు.


పొజిటివ్ రియాక్షన్ :


ఇక పవన్ వైపు తీసుకుంటే రెండు రోజుల ముందే బీజేపీతో పొత్తుల విషయమై పార్టీ సమావేశంలో పాజిటివ్ గా రియాక్ట్ అయ్యారు. బీజేపీ మత తత్వ పార్టీ కాదని కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. ఆ పార్టీలో విలీనం అయితే తప్పు కాని, పొత్తులు తప్పు కావని కూడా చెప్పుకొచ్చినట్లుగా కధనాలు వెలువడ్డాయి. అంటే తెర చాటున మంతనాలు జోరుగా సాగుతున్నట్లుగా అర్ధం చేసుకోవాలి. ఏపీలో పవన్ కి ఊపు ఉంది కానీ క్యాడర్ లేదు. అదే బీజేపీతో కలిస్తే క్యాడర్ ప్లస్ అవుతుంది. పైగా ఆరెసెస్ క్యాడర్ బలం కూడా దొరుకుతుంది. అన్నింటినీ మించి కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండడం కూడా ప్లస్ పాయింట్ అవుతుంది. దీంతో పవన్ మొగ్గు చూపుతున్నారని అంటున్నారు. 


జనం ఎటువైపు :


కాంగ్రెస్ తో టీడీపీ పొత్తు కంటే పవన్ బీజేపీతో  పొత్తు అన్నది ఎంతో ఉత్తమైనదిగా జనంలో చెప్పుకునే అవకాశం ఉంది. అయితే ఏపీ జనం ప్రత్యేక హోదా ఇవ్వలేదన్న ఆగ్రహంతో ఉన్నారు. దానికి పవన్ కమలనాధుల నుంచి ఎటువటి భరోసా తెస్తారో చూడాలి. ఒకవేళ తగిన హామీలు ఇస్తూ బీజేపీ రంగంలోకి వస్తె ఈ పొత్తును జనం ఆహ్వానించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరి చూడాలి ఏం జరుగుతుందో.
 


మరింత సమాచారం తెలుసుకోండి: