రాజకీయ నాయకులు ఎపుడూ పోయిన చోటే వెతుకుతారు. లోటు ఎక్కడ ఉందో చూసుకుని మరీ పూడ్చడానికి ప్రాధ్యాన్యత ఇస్తారు. ఇందుకోసం ఎన్నో ఎత్తుకు, జిత్తులు కూడా వేస్తూంటారు. ఓటమి నుంచి గెలుపు తీరాలకు చేరాలన్న కసి వేసే ప్రతి అడుగులో కనిపిస్తుంది. ఆ వ్యూహాలు కూడా అలా పకడ్బంధీగా ఉంటాయి. ఇపుడు ఏపీలో ఆ జిల్లా పేరు మారు మోగుతోంది. ఎందుకు అంటే...


కర్నూలు కల :


ముఖ్యమంత్రి చంద్రబాబుకు కర్నూలు కలలోకి వస్తోంది. ఇపుడే కాదు. నాలుగున్నరేళ్ళుగా ఊరిస్తోంది. అక్కడ పోయిన ఎన్నికల్లో టీడీపీ ఘరంగా ఓడిపోయింది. ప్రతిపక్ష  వైసీపీ మెజారిటీ సీట్లు గెలుచుకుంది. అందువల్ల ఆ జిల్లాపై సీఎం కి ఇపుడు ఎనలేని ప్రేమ కలుగుతోంది. ఈ సారి ఎలాగైనా మొత్తం సీట్లు గెలవాలి. కర్నూలు కోటను బద్దలు కొట్టాలి. ఇదే లక్ష్యంగా  సాగుతున్నాయి ఆలోచనలు.


పదవులన్నీ అక్కడే:


కర్నూలు జిల్లాకే ఇపుడు పదవులన్నీ వెళ్ళిపోతున్నాయి. తాజాగా జరిగిన విస్తరణలో ఏకంగా మూడు మంత్రి పదవులు జిల్లాకు ఇచ్చినట్లైంది. అంతే కాదు, ఉప ముఖ్యమంత్రి ఇక్కడే ఉన్నారు. రెడ్డి, బీసీ, మైనారిటీ ఇలా సామాజిక వర్గం తూకం వేసుకుని మరీ మంత్రులను చేశారు చంద్రబాబు.   అంతేకాదు. ఇక్కడ పట్టణంలో పెద్ద సంఖ్యలో ఉన్న వైశ్యులను దగ్గర తీసేందుకు టీజీ వెంకటేష్ ని రాజ్యసభకు పంపారు.  వివిధ సామాజిక వర్గాలకు చెందిన మరో ఎనిమిది మందికి కీలకమైన నామినేటెడ్ పదవులు కూడా కట్టబెట్టారు. ఇదంతా ఎందుకంటే రేపటి రోజున కర్నూలులో టీడీపీ జెండా ఎగరాలన్న ఎత్తుగడలో భాగంగా అన్న మాట.


వర్కౌట్ అవుతుందా :


కర్నూలు కోసం బాబు బాగానే కష్టపడుతున్నారు. తరచూ అక్కడికి వెళ్తున్నారు. నిధులు, నిక్షేపాలు కూడా ఇక్కడే పెద్ద ఎత్తున  ఖర్చు చేస్తున్నారు. మరి ఎంత చేసినా ఈ జిల్లా సైకిల్ ఎక్కుతుందా అంటే డౌటే మరి. ఎందుచేతనంటే కర్నూల్లో టీడీపీకి వ్యతిరేకత అలాగే ఉంది ఒక్క చోట గెలవడానికి ఇది నంధ్యాల ఉప ఎన్నిక కాదు. రేపటి సార్వత్రిక ఎన్నికల్లో జనం మొగ్గు విపక్షానికే మళ్ళీ అని సర్వేలు కలవరం కలిగిస్తున్నాయి. మరో  ఆరు నెలల్లో ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలో. కర్నూలు కల ఎలా నెరవేర్చుకోవాలో ..మొత్తానికి కర్నూలు బాబును బాగానే  కంగారు పెడుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: