నాలుగున్నరేళ్ళు ఓ కేసును విచారించిన చంద్రబాబాయుడు ప్రభుత్వం చివరకు నిందితులను పట్టుకోలేక కేసునే మూసేస్తోంది. ఈ ఒక్క ఘటన చాలు టిడిపి ప్రభుత్వం ఎంత సమర్ధవంతంగా పనిచేస్తోందో చెప్పటానికి. 2014,  డిసెంబర్ 29వ తేదీన రాజధాని ప్రాంతంలోని రైతుల పొలాలు తగలబడటం గుర్తుంది కదా ? తాడేపల్లి, తుళ్ళూరు ప్రాంతాల్లోని 13 మంది రైతుల పొలాల్లోని పంటలు అర్ధరాత్రి  తగలబడ్డాయి. ఘటన వెలుగు చూడగానే పంటలు తగలపెట్టించింది వైసిసి నేతలే అని, జగన్ మనుషులే చేశారంటూ చంద్రబాబు, ప్రత్తిపాటి పుల్లారావు లాంటి నేతలందరూ ఒకటే ఊదరగొట్టారు. ఘటనకు పాల్పడింది ఎవరో తెలీదు కానీ వైసిపి మీద మాత్రం గుడ్డకాల్చి మీదేసేశారు.

 

పంటలు కాల్చింది వైసిపి నేతలేఅని చెప్పాలంటూ రైతుల నుండి ఫిర్యాదులు తీసుకునేందుకు పోలీసులు చాలా ప్రయత్నాలే చేశారు. కానీ సాధ్యం కాలేదు. దాంతో రైతులను చాలామందిని విచారణ పేరుతో పోలీసులు నిర్భందించారు. రాజధాని నిర్మాణం పేరుతో రైతుల నుండి ప్రభుత్వం పొలాలు తీసుకున్నవిషయం తెలిసిందే. అయితే, కొందరు రైతులు మాత్రం పొలాలు ఇవ్వటానికి ఇష్టపడలేదు. ప్రభుత్వం ఒత్తిడిపెడితే ఎదురుతిరిగారు. అటువంటి రైతుల్లో కొందరి పంటలు తగలబడ్డాయి. ఆ తర్వాత కేసులో అనేక రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంది. అనుమానం పేరుతో కొందరు వైసిపి నేతలను కూడా పోలీసులు విచారణ పేరుతో అదుపులోకి తీసుకున్నారు.

 

ఇక, ప్రస్తుతానికి వస్తే ఘటనపై ప్రభుత్వం సిట్ విచారణ వేసింది. అయితే, నాలుగున్నరేళ్ళ తర్వాత కూడా నిందితులు ఎవరో సిట్ గుర్తించలేకపోయిందట. అందుకనే కేసును మూసేస్తున్నట్లు ప్రభుత్వం రైతులకు నోటీసులు ఇచ్చింది. నిందుతులెవరో గుర్తించలేని ప్రభుత్వం మరి ఘటనకు బాధ్యులుగా వైసిపి నేతలే అని ఎలా ఆరోపించింది ? అదుపులోకి తీసుకుని ఏం విచారించింది ? అందుకే రైతులు ఇపుడు ప్రభుత్వంపై మండిపోతున్నారు. తమ పంటలను తగలబెట్టిందే ప్రభుత్వం అంటూ రైతులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వంపై న్యాయపోరాటానికి కొందరు రైతులు సిద్ధపడుతుండటం గమనార్హం.

 

 

 

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: