ఈ మధ్యన అందరికీ కర్నాటక మీదనే చూపు ఉంటోంది. దేశ రాజకీయాల్లో మలుపు తిప్పిన ఫలితం, కుర్చీలాట అక్కడే చోటుచేసుకున్నాయి. ఎవరు ఏమైనా చేయవచ్చు, ఎలాగైనా కలసిపోవచ్చు అన్న నయా పాలిట్రిక్స్ కి అద్దం పట్టింది అక్కడ వ్యవహారం. అందుకే ఇపుడు పొరుగు తెలుగు రాష్టాలు సైతం కర్నాటక ఫార్ములా అంటే ముచ్చట పడుతున్నాయి.


మొత్తం సీట్లకు పోటీ:


తెలంగాణాలో మొత్తం సీట్లకు బీజేపీ పోటీ పడుతోంది. గతంలో పొత్తుల్లో భాగంగా టీడీపీతో కలసి పోటీ చేసి కేవలం అయిదుగురు ఎమ్మెల్యేలను మాత్రమే గెలుచుకున్న ఆ పార్టీ ఇపుడు ఆ సంఖ్యను డబుల్  చేసుకోవాలనుకుంటోంది. అపుడే తెలంగాణా తెర మీద రసవత్తరమైన ఆటకు అవకాశం ఉంటుందని భావిస్తోంది. కర్నాటక ఎన్నికల్లో ముప్పయి ఎనిమిది సీట్లు వచ్చిన కుమారస్వామి పార్టీ అందలం ఎక్కేసింది. ముఖ్యమంత్రి పదవిని హ్యాపీగా ఆయన సొంతం చేసుకున్నారు. అదే ఇక్కడ జరిగితే బాగుంటుందని బీజేపీ మనసారా కోరుకుంటోంది.


హంగ్ కోసం ఆరాటం:


ఓ వైపు మహా కూటమి, మరో వైపు టీయారెస్ ఇలా హోరా హోరీ పోరు, ఇంకో వైపు బహుజనుల పార్టీ, మరో వైపు బీజేపీ చూసుకుంటే తెలంగాణా పోరు విశ్లేషకుల అంచనాలకు అందడం లేదు. గెలుస్తామని ధీమాగా ఉన్నా కూడా ఎక్కడో టీయారెస్ లో  అలజడి, ఇక కూటమి కష్టాలు చెప్పనవసరం లేదు. మొత్తానికి ఎలాగో అభ్య‌ర్ధులు ప్రకటించుకున్నా అలకలు, కోపాలు, తాపాలు అన్నీ ఉన్నాయి. దాంతో ఎక్కడ బెడిసికొడుతుందోనని కూటమి నేతలూ కంగారు పడుతున్నారు. 


మ్యాజిక్ ఫిగర్ వస్తుందా :


ఓ వైపు కూటమి అయినా, మరో వైపు టీయారెస్ అయినా మ్యాజిక్ ఫిగర్ సాధించాలంటే కచ్చితంగా 60 సీట్లు గెలుచుకోవాలి. మొత్తం 119 సీట్లలో ఏడు సీట్లు మజ్లిస్ పక్కాగా గెలుచుకుంటుంది. 112 సీట్లలో టీయారెస్ కచ్చితంగా గెలిచేవి పాతిక సీట్లు ఉన్నాయి. కాంగ్రెస్ కూడా మరో పాతిక సీట్లు కచ్చితంగా గెలిచేవి ఉన్నాయి. మిగిలిన వాటిలో మరో ముప్పయి అయిదు సీట్లు గెలిస్తేనే ఎవరైనా అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. 
ఒక వేళా తేడా కనుక కొడితే, చిన్న పార్టీలు హవా చాటుకుంటే హంగ్ తప్పదు అపుడు వేరే పార్టీల సహకారం అవసరం పడుతుంది అలా జరిగినపుడు బీజేపీ గెలిచే సీట్లతో టీయారెస్ కి మద్దతు ఇవ్వడం ద్వారా అసలైన ఆట మొదలెట్టాలనుకుంటోంది. అందుకోసం ఇప్పటి నుంచే భారీ  కసరత్తు చేస్తోంది. ఎక్కువ సీట్లు గెలవడమే టార్గెట్ గా   ఆ పార్టీ కదన రంగంలోకి దూకుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: