వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేసి ప్రజా నేత కావాలనుకుంటున్న జనసేనాని , సినీ నటుడు పవన్ కళ్యాణ్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారన్న దానిపైన ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. చంద్రబాబుకు కుప్పం, జగన్ కి పులివెందులలా  తమ నాయకుడికి ఓ పర్మనెంట్ సీటు ఉండాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే పవన్ ఒక ప్రాంతానికి పరిమితం అయ్యే నాయకుడు కాదని, ఆయన అందరి వాడని ఎక్కడైనా పోటీ చేసి గెలవగల సత్తా ఉన్న నేత అని ఆ పార్టీ వారు అంటున్నారు.


ఆ మూడు సీట్లో ఒకటి :


వచ్చే ఎన్నికల్లో పవన్ గోదావరి జిల్లాల నుంచే బరిలో ఉంటారట. ఇక పోటీ చేసే సీట్లు కూడా మూడింటిని పరిగణనలో ఉంచారట. అందులో కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, పిఠాపురం ఉన్నాయని చెబుతున్నారు. ఈ మూడు సీట్లు ఇపుడు టీడీపీ ఖాతాలోనే ఉన్నాయి. వచ్చె ఎన్నికల్లో పవన్ వీటిలో ఏది ఎంచుకున్న టీడీపీకి చెక్ పడుతుందని అంటున్నారు. ఇక పవన్ పోటీ వల్ల జిల్లాలోని మిగిలిన సీట్లపైన కూడా ఆ ప్రభావం కచ్చితంగా ఉంటుందని కూడా చెబుతున్నారు. 


మెజారిటీ ఎక్కువే:


పవన్ ఇక్కడ నుంచి పోటీకి దిగిగే మెజారిటీ  70 వేల పై చిలుకు సాధిస్తారని కూడా జనసైనికులు అంచనా వేస్తున్నారు. కాకినాడ పార్లమెంటరీ పర్ధిలో పవన్ నిర్వహించిన సభలకు జనం బ్రహ్మరధం పట్టడమే ఇందుకు కారణమని కూడా చెబుతున్నారు. మరి పవన్ గోదావరికే పరిమితమైతే ఒకే సామాజిక వర్గం, ప్రాంతం అన్న ముద్ర పడుతుందేమోనన్న ఆలొచనలు కూడా కొంత మంది చేస్తున్నారట. పవన్ గతంలో చెప్పినట్లుగా అనంతపురం, చిత్తూరులో కూడా పోటీకి దిగాలని అంటున్నారు. చూడాలి పవన్ డెసిషన్ ఎలా ఉందో.


మరింత సమాచారం తెలుసుకోండి: